📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

News Telugu: AP Tourism: చంద్రబాబు సమక్షంలో రాపిడోతో రాష్ట్ర పర్యాటక శాఖ జోడీ..

Author Icon By Rajitha
Updated: November 28, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : సిఎం చంద్రబాబు సమక్షంలో ప్రభుత్వానికి, రాపిడోకు మధ్య ఒప్పందం పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ అందాలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాపిడో సంస్థ సహకారంతో దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ గైడ్ విధానాన్ని ఏపీ పర్యాటక శాఖ ఆవిష్కరించింది. సీఎం చంద్రబాబు నాయుడు, (chandrababu naidu) పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, టూరిజం ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి మరియు రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి సమక్షంలో ఏపీ ప్రభుత్వానికి, రాపిడోకు మధ్య ఇటీవల విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో కుదిరిన ఒప్పందం మేరకు ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ గురువారం పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపింది.

Read also: YCP: ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు ఆడుతుంది- నాదెండ్ల

State Tourism Department partners with Rapido

భారతదేశంలోనే మొట్టమొదటి

ఈ ఎంఓయూ ద్వారా రాపిడోలో మంచి రేటింగ్ ఉన్న డ్రైవర్లను ఎంపిక చేసి, వారికి రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆతిథ్యం, భద్రతపై వచ్చే నెల నుంచి పర్యాటక శాఖ ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటి కార్యక్రమం కాగా, ప్రపంచవ్యాప్తంగా అరుదైన కార్యక్రమాల్లో ఒకటిగా నిలవనుందని ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలోనే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో ఈ సేవలు ప్రారంభించనుంది. రాపిడో యాప్లోనే టూరిస్ట్ ఆటోలు/క్యాబ్లు, పర్యాటక సర్క్యూట్ల వివరాలు అందు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పర్యాటకుల అందుబాటులో ఉంటాయి. విమానాశ్రయాలు, సౌకర్యార్థం ప్రత్యేక కోబ్రాండెడ్ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి పర్యాటక సేవలను సులభతరం చేయనుంది. దీనివల్ల క్యాబ్, ఆటో డ్రైవర్లకు ఆదాయం కూడా పెరుగుతుంది. టెక్నాలజీ సాయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంలో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్, పర్యాటక రవాణాలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

APTourism Chandrababu DriverGuide latest news Rapido Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.