📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

AP Tourism: ఎపిలో ఇక కేరళ తరహా జలవిహారం..

Author Icon By Rajitha
Updated: December 22, 2025 • 3:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ – పర్యాటక రంగంలో కీలక ముందడుగు పడింది. విజయవాడ బెర్మ్ పార్కు సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్ లో పర్యాటకుల కోసం ఐదు అల్ట్రా లగ్జరీ బోట్లు నడిపేందుకు ప్రైవేటు ఆపరేటర్లు ముందుకొచ్చారు. విజయవాడ బెర్మ్ పార్కు నుంచి పవిత్ర సంగమం వరకు సూర్యలంక బీచ్ బ్యాక్వాటర్లో కూడా… రాత్రి బోటులోనే బస. అక్టోబరుకల్లా అందుబాటులోకి విలాసవంతమైన పడవలు వీరికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రాథమిక అనుమతులిచ్చింది. రెండు చోట్లా ఐదు జెట్టీలు నిర్మించడంతో పాటు బోట్లకు విద్యుత్ సౌకర్యం సంస్థ కల్పించనుంది. ఐదు బోట్లకు సంబంధించిన డ్రాయింగ్లకు ఇన్లాంట్ వాటర్ వేస్ అథారిటీ అనుమతులు ఆపరేటరుల తీసుకొని బోట్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

Read also: AP: టిడిపి జిల్లా అధ్యక్ష బాధ్యతలు బిసికే

AP Tourism

పర్యాటకుల కోసం విలాసవంతమైన పడవలు

2026 అక్టోబరు నాటికి బోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కేరళ తరహాలో నదులు, సముద్రం బ్యాక్ వాటర్ లో పర్యాటకుల కోసం విలాసవంతమైన పడవలు (అల్ట్రా లగ్జరీ బోట్లు) ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ఏడాదిగా ప్రయత్నిస్తోంది. అందుకోసం ఆసక్తి గల సంస్థలను ఆహ్వానించింది. కేరళలో ఇప్పటికే ఈ తరహా సేవలు అందిస్తున్న ఒక సంస్థ ఏపీకి చెందిన మరొకరితో కలిసి ఉమ్మడి భాగస్వామ్యం కింద బెర్మ్ పార్కు నుంచి పవిత్ర సంగమం వరకు రెండు బోట్లు నడిపేందుకు ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి 20 కిలోమీటర్ల మేర సర్వే కూడా చేశారు. ఒక బోటులో ఐదు పడక గదులు, వంద మందికి సరిపడా కాన్ఫరెన్స్ హాలు ఉంటుంది.

మార్గమధ్యంలో సుందరమైన ప్రాంతాలను

మరో బోటును 200 మంది డిన్నర్ చేసేందుకు వీలుగా డిజైన్ చేయనున్నారు. రాత్రుల్లో భవానీ ద్వీపం వద్ద బోట్లు నిలిపేలా అక్కడో జెట్టీ, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్లో నాగ రాజు కెనాల్ నుంచి నిజాంపట్నం వరకు మూడు బోట్లు ప్రైవేటు సంస్థలు నడపనునానయి. ఒక బోటులో 9, మరో బోటులో 3, ఇంకో బోటులో 2 పడక గదులు ఉంటాయి. బ్యాక్ వాటర్లో దాదాపు 30 కిలోమీటర్ల మేర బోటులో ప్రయాణించవచ్చు. మార్గమధ్యంలో సుందరమైన ప్రాంతాలను కూడా గుర్తించారు. విశాఖ తీరంలో రాజమహేంద్రవరం, కాకినాడలో గోదావరి నదిలో, నాగార్జునసాగర్లో నూ అల్ట్రా డీలక్స్ బోట్లు ప్రైవే టు ఆపరేటర్లతో నడిపేలా పర్యాటకాభివృద్ధి సంస్థ ఫీజబులిటీ సర్వేచేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆసక్తిగల సంస్థలను ఆహ్వానిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Tourism latest news Luxury Boats Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.