AP to Hyderabad traffic : సంక్రాంతి పండగ ముగియడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ వైపు భారీగా వాహనాలు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65)పై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో ప్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున అక్కడ వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నల్లగొండ జిల్లా (AP to Hyderabad traffic) ఎస్పీ శరత్ చంద్ర పవార్ మొత్తం ఐదు ట్రాఫిక్ డైవర్షన్లను ప్రకటించారు. వాహనదారులు ముందుగానే ఈ మార్గాలను అనుసరించాలని సూచించారు.
Read Also: Telangana: రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
డైవర్షన్ వివరాలు ఇలా ఉన్నాయి:
- గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు
గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ మార్గం ద్వారా హైదరాబాద్ చేరుకోవాలి. - మాచర్ల నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు
మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ మీదుగా హైదరాబాద్‌కు మళ్లించారు. - నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు
నల్లగొండ → మార్రిగూడ బైపాస్ → మునుగోడు → నారాయణపూర్ → చౌటుప్పల్ జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి. - విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే భారీ వాహనాలు
కోదాడ → హుజూర్నగర్ → మిర్యాలగూడ → హాలియా → చింతపల్లి → మాల్ మార్గం ద్వారా డైవర్షన్ ఉంటుంది. - NH-65పై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే
చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో తీవ్ర రద్దీ ఏర్పడినట్లయితే, వాహనాలను చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తామని పోలీసులు తెలిపారు.
సంక్రాంతికి వెళ్లిన ప్రజలు సురక్షితంగా, సాఫీగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు. డైవర్షన్ అమలులో వాహనదారులు సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: