📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP TIDCO Houses: ఉగాదికి లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీ!

Author Icon By Tejaswini Y
Updated: February 27, 2026 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP TIDCO Houses: ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. రాబోయే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష టిడ్కో (TIDCO) ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ వెల్లడించారు.

Read also: Satyakumar Yadav: కిడ్నీ రోగులకు ఏపీ సర్కార్ భరోసా

AP TIDCO Houses: One lakh TIDCO houses distributed for Ugadi!

బ్యాంకర్లతో కీలక భేటీ – రుణాల మంజూరు

గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బ్యాంకు అధికారులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సుమారు 40,500 మంది లబ్ధిదారులకు ₹1,345 కోట్ల మేర రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకారం తెలిపారు. ఈ నిధులతో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి, గృహప్రవేశాలకు సిద్ధం చేయనున్నారు.

జూన్ నాటికి 2.61 లక్షల ఇళ్లే లక్ష్యం

ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.61 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉగాది (మార్చి 19) నాటికి మొదటి విడతగా లక్ష ఇళ్లను పంపిణీ చేసి, ఆ తర్వాత మిగిలిన గృహాలను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయనున్నారు. ఈ నిర్ణయంతో వేలాది కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Housing Scheme AP TIDCO Houses TIDCO Home Loans Ugadi Gift

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.