AP TIDCO Houses: ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. రాబోయే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష టిడ్కో (TIDCO) ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ వెల్లడించారు.
Read also: Satyakumar Yadav: కిడ్నీ రోగులకు ఏపీ సర్కార్ భరోసా

బ్యాంకర్లతో కీలక భేటీ – రుణాల మంజూరు
గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బ్యాంకు అధికారులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సుమారు 40,500 మంది లబ్ధిదారులకు ₹1,345 కోట్ల మేర రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకారం తెలిపారు. ఈ నిధులతో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి, గృహప్రవేశాలకు సిద్ధం చేయనున్నారు.
జూన్ నాటికి 2.61 లక్షల ఇళ్లే లక్ష్యం
ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.61 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉగాది (మార్చి 19) నాటికి మొదటి విడతగా లక్ష ఇళ్లను పంపిణీ చేసి, ఆ తర్వాత మిగిలిన గృహాలను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయనున్నారు. ఈ నిర్ణయంతో వేలాది కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: