బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ
విజయవాడ : నేతన్నలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మరో గుడ్ న్యూస్ అందిం చారు. (AP) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్ నిధులను జారీచేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత (Minister S. Savita) తెలియజేశారు. చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేశామన్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. ఏటా రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు చేనేత సహకార సంఘాలకు అందజేస్తామని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేశామన్నారు.
Read Also: చేనేతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
5,726 మందికి లబ్ధి: మంత్రి సవిత వెల్లడి
(AP) రాష్ట్ర వ్యాప్తంగా 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో 5,726 మంది నేతన్నలకు లబ్ధి కలుగనుందన్నారు. ఈ నెలలోనే సంక్రాంతి ముందు ఆప్కో ద్వారా రూ.5 కోట్లు బకాయిలను చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. గడిచిన డిసెంబర్ లో కూడా రూ.2.42 కోట్ల మేర ఆప్కో బకాయిలు చెల్లించిన విషయాన్ని కూడా మంత్రి గుర్తు చేశారు. ఇలా కేవల రెండు నెలల వ్యవధిలో రూ.9 కోట్లకుపైగా నిధులను చేనేత సహకార సంఘాలకు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు. మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల చేయడంపై చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు సిఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: