📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

AP: త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Author Icon By Saritha
Updated: January 31, 2026 • 10:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఘాట్ లో కాలుష్య నియంత్రణ దిశగా టిటిడి కార్యాచరణ

తిరుమల : ఆధ్యాత్మికనగరం… (AP) యాత్రాస్థలం తిరుపతిలో రోజురోజుకూ పెరిగిన కాలుష్య శాతాన్ని నియంత్రించడంలో భాగంగా పుణ్యక్షేత్రం తిరుమలకు పాత డీజిల్, పెట్రోల్ నడిచే వాహనాలకు త్వరలోనే చరమగీతం పాడాలనే కార్యాచరణ టిటిడి (TTD) రూపొందిస్తోంది. ఇందుకోసం యాత్రి కులు కూడా వీలైనంత వరకు విద్యుత్ వాహనా లను వినియోగించుకునే దిశగా టిటిడి అవగా హన కల్పించనుంది. తిరుపతి నుండి తిరుమలకు ఘాట్లో నడిచే వాహనాల వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. పర్యావరణం కూడా కలుషితమ వుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకొండపై వాయు, వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వాహనాల వినియోగంపై టిటిడి అధికారులు ఇప్పటికే దృష్టిపెట్టారు. దశాబ్దకాలం క్రిందటి వాహనాలను, కాలంచెల్లిన వాహనాలను తిరుమలకు దాదాపు అనుమతించడం లేదు. అలిపిరి వద్ద రవాణాశాఖ, పోలీసులు తనిఖీ చేసి ఆ తరువాత అనుమతినిస్తున్నారు.

Amaravati : మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

సీఎం చంద్రబాబు సూచనలతో టిటిడికి స్పష్టంగా

ఘాట్లో సొమర్థ్యం లేనివాహనాలను అలిపిరిలోనే నిలిపివేసి ఆర్టీసి బస్సుల్లో, ప్రత్యామ్నాయాలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో(AP) తిరుమలను పూర్తిస్థాయి లో కాలుష్య రహిత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలనే సిఎం చంద్రబాబునాయుడు సూచనలు టిటిడికి స్పష్టంగా తెలిపారు. ఈ నేపథ్యంలో టిటిడి అధికారులు కూడా తిరుమల వాహనాలు విద్యుత్ వినియోగం అవగాహన, చర్యలకు సిద్దమవుతున్నారు. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, ఇఒ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో చిరు మామిళ్ళ వెంకయ్య చౌదరి సిఎం సూచనలు అమలు చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసు కుంటున్నారు.

ఇప్పటికే తిరుమలకు 50వరకు విద్యుత్ నడిచే ఆర్టీసి బస్సులు తిరుగుతు న్నాయి. ఇవేగాక మరో వందవరకు టిటిడి అధికారుల కార్లు, రెండువందల పైగా ద్విచక్ర వాహనాలు కూడా విద్యుత్ నడిచేవి వినియో గిస్తున్నారు. గతంలోనే తిరుమలకు విద్యుత్ వాహనాలు నడపాలని ప్రభుత్వం సంకల్పిం చింది. టిటిడి ఉద్యోగులకు గత బోర్డు సులభవిధానంలో విద్యుత్ వాహనాలు కొనుగోలుకు మార్గం సుగమం చేశారు. ఇప్పుడు తిరుమల పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలవుతోంది. ఇక పూర్తిగా పాత డీజెల్, పెట్రోల్తో నడిచే వాహనాలను కూడా మెల్లగా తిరుమలకు అనుమతించకూడదని నిర్ణయిం చారు. ప్రస్తుతం ఆరువేలవరకు రోజువారీగా

కాలుష్యరహిత పుణ్యక్షేత్రంగా తిరుమల

యాత్రికుల వాహనాలు, ట్యాక్సీలు దేశంలోని అనేక రాష్ట్రాల నుండి పెట్రోల్, డీజెల్తో నడిచేవి తీసుకువస్తున్నారు. 450వరకు ఆర్టీసి బస్సులు డీజిల్ నడిచేవి తిరుగుతున్నాయి. (AP) స్థానికంగా తిరుపతి- తిరుమల మధ్య నాలుగు వేల వరకు ట్యాక్సీలు, వాహనాలు డీజెల్, పెట్రోల్వి నడుపుతున్నారు. దీనివల్ల ఘాట్లో, తిరుమల కొండపై కాలుష్యం శాతం పెరిగిపో తోందనేది పర్యావరణ శాస్త్రవేత్తల అంచనా. దీన్ని తగ్గించేందుకు, పచ్చదనం పెంపొందించ డంతోబాటు పూర్తిగా విద్యుత్తో నడిచే వాహ నాలను వినియోగంలోకి తీసుకురావాలని టిటిడి అధికారులు తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు. 2026 జూన్ నాటికి పాత డీజెల్, పెట్రోల్ వాహనాలను ఘాట్లో అనుమతించరాదనేది ఒక అంశంగా చర్చించారు. తిరుమలను కాలుష్యరహిత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలనే ఆశయం దిశగా అడుగులు పడుతుండటం. శుభపరిణామంగానే భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Electric Vehicles Environmental Protection ghat roads Pollution Control tirumala tirupati TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.