📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం

AP: రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సబ్ కమిటీ మూడవ సమావేశం

Author Icon By Tejaswini Y
Updated: December 24, 2025 • 3:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: విశాఖలోని రుషికొండ ప్యాలెస్(Rushikonda Palace) వినియోగంపై ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ మూడవ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ, ఏపీ టీఏ సీఈఓ ఆమ్రపాలి, ఇతర పర్యాటక అధికారులు పాల్గొన్నారు. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వర్చువల్ ద్వారా సమావేశంలో భాగమయ్యారు.

Read also: AP Politics: లోకేశ్ అవినీతి కేసుల్లో పవన్ పాత్ర ఉందంటూ అంబటి రాంబాబు ఆరోపణలు

సబ్ కమిటీ ఈ భవనాన్ని హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో వినియోగించాలా అనే అంశాన్ని పరిశీలించింది. కొందరు హోటల్ అవసరాలకు అదనపు స్థలాన్ని కోరారు. రుషికొండలోని 9 ఎకరాల్లో 7 ఎకరాలు CRZ నిబంధనల పరిధిలోకి వస్తాయని, అందులో ఏ కొత్త నిర్మాణాలు జరగకూడదని స్పష్టంగా తెలిపారు.

ప్యాలెస్ చివరి రెండు బ్లాక్‌లను ప్రజలకు, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యాటక అవసరాల కోసం కేటాయిస్తామని, అదే సమయంలో తాజ్ గ్రూప్, లీలా హోటల్ గ్రూప్, అట్మాస్పియర్ కోర్ వంటి సంస్థలు ప్రాజెక్ట్‌లకు ఆసక్తి చూపినట్లు పయ్యావుల పేర్కొన్నారు. రుషికొండపై మళ్లీ రెండు అంతస్తులు నిర్మించే అవకాశముందని కూడా తెలిపారు.

మంత్రులు కందుల దుర్గేశ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం(Government)లో ఆదాయం వచ్చే భవనాలను కూల్చి ప్యాలెస్ నిర్మాణానికి కేటాయించారని విమర్శించారు. రుషికొండ వినియోగానికి సంబంధించి అనేక ప్రపోజల్స్ వచ్చాయని, అయితే సముద్ర తీరంలో ఆటుపోట్ల కారణంగా 9 ఎకరాల్లో కేవలం 2 ఎకరాల స్థలం మాత్రమే సౌకర్యానికి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Tourism CRZ Rules Rushikonda Hotel Project Rushikonda Palace Tourism Department Visakhapatnam Palace

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.