📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

AP: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం.. త్వరలోనే మరొకటి!

Author Icon By Saritha
Updated: January 27, 2026 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి. (AP) పశ్చిమ బైపాస్‌లో ఒకవైపు వాహనాలను అనుమతించడంతో ట్రాఫిక్ నుంచి ఊరట దక్కింది. మహానాడు కూడలితో పాటుగా స్క్యూ వంతెన దగ్గర వాహనాల రద్దీ తగ్గింది. వెస్ట్ బైపాస్ రెండో వైపు పనులు పూర్తయితే విజయవాడపై మరింత ట్రాఫిక్ భారం తగ్గుతుంది. ఆటోనగర్‌కు వెళ్లే భారీ వాహనాలను నగరంలోకి రాకుండా.. వాటికి సమయాలు నిర్దేశిస్తే ట్రాఫిక్ సమస్య మరింత తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి నుంచి పశ్చిమ బైపాస్‌పై గుంటూరు జిల్లా కాజ దగ్గర రాకపోకలు ప్రారంభించారు.

గుంటూరు నుంచి హైదరాబాద్, ఏలూరు వెళ్లే వాహనాలు విజయవాడలోకి రావడం లేదు. పోలీసులు వాహనాలను కాజ దగ్గర మళ్లిస్తున్నారు. అప్పటి నుంచి నగరంలో వాహనాల రద్దీ తగ్గింది. సాధారణ రోజుల్లో వారధి నుంచి ఎనికేపాడు వరకు వాహనాలు నిలిచిపోయేవి.. ఇప్పుడు కాస్త మార్పు వచ్చింది. సెలవులు, ఆదివారాల్లో అయితే ఆ రద్దీ మరింత తగ్గుతోంది. పశ్చిమ బైపాస్‌తో విజయవాడలో ట్రాఫిక్‌‌ ఫ్రీ జర్నీకి సానుకూలంగా ఉంటోంది.

Read Also: AP: ఆడుకుంటూ మాయమైన బాలుడు.. బావిలో మృతదేహం లభ్యం

The new bypass has finally been inaugurated

రెండో వైపు బైపాస్ పనులు

ప్రస్తుతం(AP) ఏలూరు నుంచి గుంటూరు వైపు వెళ్లే వాహనాలకు కాజ దగ్గర రోడ్డు పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తున్నారు. చినఆవుటపల్లి దగ్గర పశ్చిమ బైపాస్‌లోకి వెళ్లాల్సిన వాహనాలను విజయవాడ నగరంలోకి మళ్లించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈ మార్గంలో కూడా బైపాస్ పనులు పూర్తయితే పరిస్థితి మెరుగుపడుతుంది. 

వివిధ ప్రాంతాల నుంచి నిత్యం విజయవాడ (Vijayawada) ఆటోనగర్‌కు భారీ వాహనాలు వస్తుంటాయి. అయితే, ఈ వాహనాలు ఎప్పుడు నగరంలోకి రావాలి ఎప్పుడు వెళ్లాలి అనేది స్పష్టమైన సమయాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. బైపాస్ రోడ్డు రెండో వైపు పనులు కూడా పూర్తయితే అప్పుడు భారీ వాహనాలు ఆటోనగర్‌లోకి ఎప్పుడు అనుమతించాలో సమయాలను నిర్ణయించే అవకాశం ఉంది. అప్పుడు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. 


Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Traffic Update Kazha Junction Latest News in Telugu Telugu News Traffic Relief Vijayawada Bypass Road Vijayawada traffic West Bypass Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.