వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
సచివాలయం : (AP) ఆంధ్రప్రదేశ్ లో పశుగణ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.(Kinjarapu Atchannaidu) తెలిపారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధుల నియంత్రణ, పశుపోషణ ఖర్చుల తగ్గింపే లక్ష్యంగా జన్మభూమి తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ శిబిరాల కార్యక్రమాన్ని విజయవాడ రూరల్ మండలంలోని నిడమానూరు గ్రామంలో సోమవారం ఉదయం ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ. వెంకట్రావుతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, పశుపోషణ రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నేపథ్యంలో పశువుల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
Read Also: Pinnelli Brothers : మరోసారి కస్టడీలోకి పిన్నెల్లి సోదరులు
గుడ్లు, పాలు, మాంస ఉత్పత్తుల్లో ఎపి అగ్రస్థానం
గ్రామీణ ప్రాంతాల్లోని పశు పాలకులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, పశువులకు వ్యాధులు రాకుండా ముందస్తు చికిత్సలు చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. (AP) పశువులకు ఉచిత వైద్య సేవలు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందుల పంపిణీతో పాటు శాస్త్రీయ పశు యాజ మాన్యంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పశుగణ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారంగా నిలుస్తోందని, ముఖ్యంగా మహిళల జీవనోపాధికి ఈ రంగం కీలకమని పేర్కొంటూ, పశుపోషకులకు పూర్తి భరోసా కల్పించేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పశు సంవర్ధక రంగం ముఖ్యంగా మహిళల జీవనోపాధికి కీలకమని పేర్కొన్న మంత్రి అచ్చెన్నాయుడు, స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తుల్లో దేశంలో తొలి మూడు స్థానాల్లో నిలవాలనే దిశగా స్పష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమార స్వామి, టిడిపి నాయకులు గొడ్డళ్ల చిన్న రామారావు, బండి వెంకట్రావు (నాని), దయాల రాజేశ్వరరావు, గూడపాటి తులసిమోహన్, కోనేరు నాగేంద్ర కుమార్, బిజెపి నాయకులు కురుమద్దాలి ఫణి కుమార్, కానూరి శేషు మాధవి, నాదెండ్ల మోహన్, ఉయ్యూరు వెంకటేశ్వరరెడ్డి, జనసేన పార్టీ నాయకులు పొదిలి దుర్గారావు, మేకల స్వాతి తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: