📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: విజయసాయిరెడ్డిని 7 గంటల పాటు విచారించిన ఈడీ

Author Icon By Aanusha
Updated: January 22, 2026 • 7:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ (AP) లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. సుమారు ఏడు గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ మద్యం కుంభకోణం కేసులో కొందరు నిందితులు అరెస్టైన విషయం తెలిసిందే.

Read Also: AP Capital : రాజధాని నిర్మాణంలో భారీ దోపిడీ – జగన్

ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం లైసెన్సులు, డిస్ట్రిబ్యూషన్, విక్రయాల్లో భారీగా అవకతవకలు జరిగాయని, దీని ద్వారా సుమారు రూ. 3,500 కోట్లు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై సిట్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో విజయసాయి రెడ్డి నిందితుడిగా ఉన్నారు.

AP: The ED questioned Vijayasai Reddy for 7 hours

ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న మరికొందరు నేతలు, మధ్యవర్తులపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP liquor scam ED investigation latest news Telugu News Vijay Sai Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.