ఆంధ్రప్రదేశ్‌లో(AP) జిల్లాల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయాలతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కు పెరిగింది. క్యాబినెట్ తీర్మానం ప్రకారం మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ జిల్లాల ఏర్పాటుతో పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: AP: పునర్విభజనపై తుది నిర్ణయం.. జిల్లాల సంఖ్య 28కి పరిమితం
అన్నమయ్య జిల్లా కేంద్రంలో మార్పు
జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చాలని క్యాబినెట్ నిర్ణయించింది. దీంతో మదనపల్లె(AP) ప్రాంతానికి జిల్లా కేంద్ర హోదా లభించింది. క్యాబినెట్ నిర్ణయం మేరకు కొన్ని పట్టణాలు, మండలాల పరిపాలనా పరిధిలో మార్పులు చేపట్టారు:
- రాయచోటి – మదనపల్లె జిల్లాలో విలీనం
- రైల్వేకోడూరు – తిరుపతి జిల్లాలో చేరిక
- రాజంపేట – కడప జిల్లాలో విలీనం
- గూడూరు – తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకు మార్పు
ఈ మార్పులు పరిపాలనా సౌలభ్యం దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలుగా ప్రభుత్వం తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: