Ap: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 140 మీటర్ల వెడల్పుతోనే

Read Time:  1 min
The Amaravati Outer Ring Road will be 140 meters wide
The Amaravati Outer Ring Road will be 140 meters wide
FONT SIZE
GET APP

విజయవాడ : ఓఆర్ఆర్ (అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు) భూసేకరణ విషయంలో రైతుల ఆందోళన ప్రభుత్వం తెరదించింది. 140 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మిస్తామని స్పష్టం చేసింది. ముందస్తు ప్రతిపాదనల్లో 140 మీటర్ల వెడల్పు భూమి అని ఉంటే గెజిట్ నోటిఫి కేషన్లో 250 మీటర్లుగా పేర్కొనడంతో రైతుల్లో కలవరం మొదలైంది. ఈ అంశంపై అధికారుల చుట్టూ తిరుగుతూ ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు రైతులు ఆందోళనలు చేపట్టారు. ఇది ముందు జాగ్రత్త కోసమేననీ 140 మీటర్ల వెడల్పుతోనే ఓఆర్ఆర్ నిర్మిస్తామని అధికారులు స్పష్టత ఇస్తున్నారు. 3ఏ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తవకుండా సాధారణంగా 3ఏ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తవకుండా భూమి సర్వేకు అధికారులకు హక్కు ఉండదు. దీంతో కొలతలు తీసి సరిహద్దులు వేయలేరు.

Read also: Shinganamala crime: భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య

The Amaravati Outer Ring Road will be 140 meters wide

The Amaravati Outer Ring Road will be 140 meters wide

జీపీఎస్పై ఆధార పడాల్సిందే, ఆందోళన అవసరం లేదు. 140 మీటర్ల వెడల్పును జీపీఎస్ ప్రామాణికంగా తీసుకుని సరిహద్దులు నిర్ధారిస్తే క్షేత్ర స్థాయిలో కొన్నిచోట్ల 510 మీటర్లు తేడా వచ్చే వీలుంది. ఇలాగైతే ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి చేయాల్సిందే. దీంతో ప్రాజెక్టు మరో ఏడాది ఆలస్యం అవుతుంది. ఈ సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా నోటిఫికేషన్లో 250 మీటర్లని ప్రస్తావించారు. అభ్యంతరాల ప్రక్రియ పూర్తయి సర్వే చేశాక 140 మీటర్లకే క్షేత్రంలో కొలత వేసి సరిహద్దులు నిర్ణయించి ఆ మేరకే భూమి తీసుకుంటారు. ఈ విషయం తుది నోటిఫికేషన్లో పొందుపరుస్తారు. కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం మండలాల్లో 18 గ్రామాల్లో 1,798 సర్వే నంబర్లలో 1,416.31 హెక్టార్లు సేకరించనున్నారు. జనవరి 5న విడుదలైన గెజిట్ నోటిఫికేషన్లో 140కు బదులుగా 250 మీటర్ల భూసేకరణ అని ఉంది.

140 మీటర్లే ఎక్కువనీ, 250 మీటర్లు తీసుకుంటే నష్టపోతామనీ, విలువైన వంటలు పండే భూమి కోల్పోయి. జీవనోపాధి ప్రశ్నార్థకం అవుతుందని రైతులు వాపోతున్నారు. గ్రామసభలు, ప్రజా విచారణ చేపట్టకుండా, భూయజమానులను సంప్రదించకుండా నిర్ణయించారని చెబుతున్నారు. ప్రారంభంలో ఈ రింగ్ రోడ్ 70 మీటర్ల వెడల్పుతో ఉండాలని మోర్త్ ఎలైన్ మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆ ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టు ఖర్చు రూ.16,310 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో సివిల్ పనులకు రూ.12,995 కోట్లు, 1,702 హెక్టార్ల భూసేకరణకు రూ.2,665 కోట్లు, 124 హెక్టార్ల అటవీ భూముల సేకరణకు రూ. 150 కోట్లు, పర్యావరణ అనుమతులకు రూ.200 కోట్లు, ఇతర వ్యయాలకు రూ.300 కోట్లు కేటాయించారు. ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ కేవలం రాజధాని ప్రాంతం వైపు మాత్రమే సర్వీస్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అప్పుడు సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించారు. ఇరువైపు లా సర్వీసు రోడ్లు ఉంటేనే ఓఆర్ఆర్కు ఆనుకొని ఉండే గ్రామాలు, పట్టణాలకు చెందినవారు సులువుగా రాకపోకలు సాగించగలరని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.