ఆంధ్రప్రదేశ్ (AP) పాఠశాల విద్యాశాఖ, విద్యార్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. 2026 మార్చి నెలలో నిర్వహించనున్న ఎస్ఎస్‌సి (SSC) పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. దీనితో పాటు ఓపెన్ స్కూల్ ఎస్ఎస్‌సి (OSSC), ఒకేషనల్ (Vocational) పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా ,
Read Also: CBN Davos Tour : గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ
ఈ టైమ్ టేబుల్‌ను ముందుగానే విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలు 2026 మార్చి 16 నుండి ప్రారంభమై ఏప్రిల్ 1 వరకు కొనసాగుతాయి. అన్ని ప్రధాన పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటలకు ముగుస్తాయి.
పూర్తి షెడ్యూల్ ఇదే
మార్చి 16: ఫస్ట్ లాంగ్వేజ్,మార్చి 18: సెకండ్ లాంగ్వేజ్,మార్చి 20: ఇంగ్లీష్,మార్చి 23: గణితం,మార్చి 25: ఫిజికల్ సైన్స్,మార్చి 28: బయోలాజికల్ సైన్స్, మార్చి 31: సోషల్ స్టడీస్,
ప్రధాన పరీక్షల అనంతరం మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2తో పాటు ఎస్ఎస్సి, ఒకేషనల్ కోర్సుల థియరీ పరీక్షలు జరుగుతాయి.అయితే, సైన్స్ పరీక్షలు మరియు కొన్ని ఒకేషనల్ కోర్సుల పేపర్లకు మాత్రమే పరీక్ష ముగింపు సమయం ఉదయం 11:30 గంటల వరకు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: