ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) కోసం దరఖాస్తుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 23తో గడువు ముగియనున్నది,ఇప్పటివరకు మొత్తం 1,97,823 మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేశారు.
Read Also: Egg prices: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధరలు
మహిళా అభ్యర్థుల సంఖ్య ఎక్కువ
అభ్యర్థుల విభాగాన్ని పరిశీలిస్తే, పురుషులు 66,104, మహిళలు 1,31,718 మంది దరఖాస్తులు సమర్పించారు. గత సంవత్సరాలతో పోల్చితే మహిళా అభ్యర్థుల సంఖ్య గణనీయంగా ఎక్కువగా కనిపించడం ప్రత్యేకతను సంతరించుకుంది.. ప్రైమరీ, హయ్యర్ ప్రైమరీ స్థాయిల్లో టీచర్ పోస్టులకు అవకాశాలు ఉండటంతో ఈసారి కూడా పోటీ భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇన్ సర్వీస్ టీచర్లకూ TET (AP TET) తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 17,883 మంది టీచర్లూ టెట్‌కు అప్లై చేశారు. అయితే సుప్రీంకోర్టు (Supreme Court) లో రివ్యూ పిటిషన్లు దాఖలైనందున తమకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుందని టీచర్లు ఆశిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: