📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu news: AP temples: ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

Author Icon By Tejaswini Y
Updated: December 4, 2025 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య ఆలయా(AP temples)ల్లో భక్తులకు అందుతున్న సేవలపై ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆశించిన ఫలితాలు రాలేదు. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సేవల నాణ్యతపై భక్తులు ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఈ ఆలయం చివరి స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితులపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టీజీఎస్‌(RTGS) ద్వారా జరిగిన రివ్యూ సమావేశంలో ఆలయాల నిర్వహణపై పలువురు ఈవోల పనితీరును సీఎం ప్రశ్నించారు. భక్తుల నుంచి భారీ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో, పెనుగంచిప్రోలు ఆలయ ఈవోను వెంటనే పదవి నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో అతనికి ఇతర పదవులు ఇవ్వకూడదనే సూచన కూడా వచ్చినట్లు సమాచారం.

Read also: AP: అమరావతికి చట్టబద్ధతకు మొదలైన ప్రక్రియ

Government survey report on AP temples

ఆలయాల సేవల్లో లోపాలు

తదనంతరం దేవాదాయశాఖ కార్యదర్శి హరిజవహర్‌లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ (Commissioner Ramachandra Mohan) మరియు మొత్తం ఏడు ప్రధాన ఆలయాలు, 14 ముఖ్య ఆలయాల ఈవోలతో సీఎస్ విజయానంద్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. భక్తుల సంతృప్తి స్థాయిని కనీసం 90 శాతం వరకు పెంచాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా తెలిపారు.

ప్రభుత్వం గత ఏడాది జూన్‌ నుండి ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులకు ఫోన్ చేసి, ఆలయ సేవలపై వారి అభిప్రాయం సేకరించింది. మొత్తం సర్వేలో సంతృప్తి స్థాయి 60–70 శాతానికి పరిమితమైందని, కొంతమంది ఆలయాల్లో ఇది 40–50 శాతం మాత్రమే ఉందని వెల్లడైంది.

శ్రీకాళహస్తి టాప్‌లో–కనకదుర్గ ఆలయం బాటమ్‌లో

ప్రధాన ఆలయాల విభాగంలో, శ్రీకాళహస్తి ఆలయం(AP temples) 72.7% సంతృప్తితో మొదటి స్థానంలో నిలిచింది. తరువాత ద్వారకాతిరుమల (71.5%), శ్రీశైలం (70.4%), కాణిపాకం (70%), సింహాచలం (68.8%), అన్నవరం (67.8%) ఉన్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం 66% సంతృప్తితో చివరి స్థానంలో నిలిచింది.

ఉపకమిషనర్ కేడర్‌ కలిగిన 14 ముఖ్య ఆలయాల్లో మోపిదేవి ఆలయం 70.2% తో మొదటి స్థానం దక్కించుకోగా, పెనుగంచిప్రోలు ఆలయం అత్యల్ప సంతృప్తితో చివరగా నిలిచింది. అందువల్లే ఆ ఆలయ ఈవోపై చర్యలు తీసుకున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Temples AP Endowments Department CM Chandrababu review Kanaka Durga Temple issues temple services survey

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.