(AP) రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనం, సేవల టికెట్లు, వసతి బుకింగ్స్,వంటి సేవలను సులభంగా పొందేలా 100 డిజిటల్ కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో భక్తుల సమయం ఆదా అవడంతోపాటు కౌంటర్ల వద్ద రద్దీ కూడా తగ్గనుంది.
Read Also: Breaking News – Vizag : పెట్టుబడుల సదస్సుకు భారీ ఏర్పాట్లు
కియోస్క్‌లు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు
సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరసవిల్లి, మహానంది, కసాపురం, కదిరి లక్ష్మీనరసింహస్వామి వంటి ప్రముఖ ఆలయాలతో పాటు మరికొన్ని ముఖ్య దేవస్థానాల్లో ఈ కియోస్క్‌లు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు తమ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌తో ఈ కియోస్క్‌లలో లాగిన్ అయి అవసరమైన సేవలను పొందగలుగుతారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: