మంత్రులతో సమావేశంలో మంత్రి లోకేష్ వ్యాఖ్య విజయవాడ : తొలిసారి గెలిచిన కొంతమంది ఎంఎల్ఎలకు మంచిచెడులు తెలియడం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ (Nara lokesh) అన్నారు. అవగాహనా రాహిత్యం, అనుభవలేమితో సమన్వయం ఉండట్లేదని వ్యాఖ్యానించారు. ఉండవల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. తొలిసారి గెలిచిన ఎంఎల్ఎలకు సీనియర్ ఎంఎల్ఎలకు సీనియర్ ఎంఎల్ఎలు, నేతలు అవగాహన కల్పించాలని సూచించారు. ఎంఎల్ఎగా గెలిచిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?ఎలాంటి సమస్యలను అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే విషయాలపై కొత్త ఎంఎల్ఎలకు అవగాహన అవసరమని చెప్పారు. కొత్తగా గెలిచిన ఎంఎల్ఎలు వరుస విజయాలు కొనసాగించాలంటే లోటుపాట్లు సరిచేసుకోవాలన్నారు. ఈ నెల 14,15 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పారు.
Read also: Puttaparthi: సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
AP: కొత్త ఎమ్మెల్యేలకు పాఠాలు చెప్పండి
20 లక్షల ఉద్యోగాల కల్పన హామీని
వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రతి మంత్రీ తమ శాఖల పరిధి ఒప్పందాలకు సంబంధించి బాధ్యతతో వ్యవహరిద్దామని చెప్పారు. మంగళవారం నిర్వహించే ఎంఎస్ఎంఇ పార్కుల కార్యక్రమంలో మంత్రులంతా విధిగా పాల్గొనాలని సూచించారు. తమ జిల్లాల పరిధిలో సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు భాధ్యత తీసుకోవాలని లోకేష్ సూచించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీని త్వరగా నెరవేరుద్దామన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో 5వసారి ‘భాగస్వామ్య సదస్సు’కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ‘టెక్నాలజీ ట్రస్ట్ అండ్ ట్రేడ్ నావిగేటింగ్ ది న్యూ జియో ఎకనామిక్ ఆర్డర్’ అనే థీమ్తో ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖలో సదస్సు జరగనుంది. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఏం కావాలో అన్నింటినీ సమకూర్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, నీటి సౌకర్యాలను కల్పిస్తోంది. ఎపిఐఐసి ఆధ్వర్యంలో ల్యాండ్బ్యాంక్ ఏర్పాటు చేసి తక్కువ ధరకే పరిశ్రమలకు భూములను కేటాయిస్తున్నారు.
3.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు
ఆర్సెలార్ మిత్తల్, ఎన్టీపీసీ, టీసీఎస్, గూగుల్ సహా ఇతర ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులు వేగంగా పూర్తిచేశారు. ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటించడంతో పాటు, జీఎస్టీపైనా రాయితీని అందిస్తున్నారన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లలో రాష్ట్రం ముందంజలో ఉంది. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ కోసం సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీలో టాటా, నవయుగ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే 3.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి. పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునే పరిశ్రమలు గ్రౌండ్ అయ్యేలోగా పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేసి నీటిని అందించనున్నారు. అదే విధంగా రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖ, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ మేజర్ పోర్టులు ఉన్నాయి. నూతన పెట్టుబడులతో పరిశ్రమలు స్టార్ట్ అయ్యేసరికి మూలపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ డీప్ వాటర్ యాంక రేజ్ పోర్టులు అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రహదారుల నిర్మాణం సైతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇవన్ని ప్రజలకు వివరించాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: