📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP Swachhthan Ambassador – ఏపీ స్వచ్ఛథాన్ అంబాసిడర్‌గా ఎవరంటే?

Author Icon By Anusha
Updated: September 18, 2025 • 10:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే స్వచ్ఛథాన్ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత జోడించబడింది. సాధారణంగా ఈ రకమైన ఈవెంట్లకు స్థానిక వ్యక్తులను లేదా ప్రముఖులను ఎంపిక చేస్తారు. కానీ ఈసారి రాష్ట్ర సరిహద్దులు దాటి, తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ఎంపిక కావడం ఆసక్తికరంగా మారింది. కామారెడ్డి జిల్లా రవాణా శాఖలో హోంగార్డు (Home Guard in the Transport Department) గా విధులు నిర్వహిస్తున్న గుగ్గిలం అశోక్‌కి ఈ గౌరవం దక్కింది. అక్టోబర్ 2న అమరావతి (Amaravati) లో జరగనున్న స్వచ్ఛథాన్‌కు ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించడం విశేషంగా మారింది.

 అశోక్‌ది నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కాగా.. ఆయన ఆయన అనేక జాతీయ, అంతర్జాతీయ మారథాన్‌లలో పాల్గొన్నారు.అశోక్ జాతీయ స్థాయిలో ఫుల్ మారథాన్‌లో (42 కి.మీ) ఎనిమిది సార్లు పాల్గొన్నారు. హాఫ్ మారథాన్‌లో (21 కి.మీ) 28 సార్లు పాల్గొన్నారు. ఆయన సాధించిన విజయాల కారణంగా ఏపీ ప్రభుత్వం ఆయనను అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. స్వచ్ఛథాన్‌ను విజయవంతం చేయడానికి అశోక్ అంబాసిడర్‌గా కృషి చేస్తారు.

AP Swachhthan Ambassador

అశోక్‌ను అంబాసిడర్‌గా

వేల్పూర్‌కు చెందిన గుగ్గిలం అశోక్ రవాణా శాఖలో హోం గార్డుగా పనిచేస్తూనే రన్నింగ్‌లో జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఆయన జిల్లా, రాష్ట్ర స్థాయిలో 65 పతకాలు సాధించారు. హైదరాబాద్‌లో 3K, 5K, 10K, 21K రన్నింగ్ పోటీలకు అశోక్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేశారు. పేదరికం వల్ల ఆయన చదువుకు ఆటంకం కలిగింది. ఇంటర్ వరకు చదివిన అశోక్, కుటుంబ పోషణ కోసం ఆటో నడిపారు. దాదాపు పదేళ్లపాటు ఆటలకు దూరంగా ఉన్నారు.

పేదరికం కారణంగా స్పోర్ట్స్ హాస్టల్‌కు వెళ్లలేకపోయారు. ఆటో నడుపుతూ ఆటలకు దూరంగా ఉన్నారు.. 2012లో స్పోర్ట్స్ కోటాలో హోంగార్డుగా ఉద్యోగం పొందారు. ఫిజికల్ డైరెక్టర్ గోపీరెడ్డి, పన్నాల హరీష్‌రెడ్డి ప్రోత్సాహంతో లాంగ్ రన్నింగ్‌పై దృష్టి సారించారు.ఈ ఏడాది ఫిబ్రవరి 9న అశోక్‌ను హైదరాబాద్ రవీంద్రభారతి (Hyderabad Ravindra Bharathi) లో కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా శాలివాహన విశిష్ట పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఉమ్మడి రాష్ట్రాల ఉత్తమ క్రీడాకారుడిగా అశోక్‌ను ఎంపిక చేశారు.అందుకే ఏపీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసిది. ఒలింపిక్స్‌లో 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్‌లో పతకం గెలవాలనేది తన కోరిక అని అశోక్ చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/assembly-sessions-from-today/andhra-pradesh/549451/

Breaking News district level medals Guggilam Ashok home guard hyderabad marathons latest news national level runner state level medals Telugu News Transport Department velpur

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.