📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP: మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట 

Author Icon By Aanusha
Updated: October 29, 2025 • 10:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టు (Supreme Court) లో ఊరట లభించింది..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో జారీ చేసిన జీవో ఆర్‌టి నంబర్ 1207 కింద 1,200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లను నియమించారు.

ఆ సమయంలో ఆరోగ్య సేవల విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తూ, ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టారు. అయితే, తర్వాత వివిధ కోర్టుల్లో ఈ నియామకాలకు సంబంధించిన పిటిషన్లు దాఖలవడంతో అనేకమందికి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఎదురైంది.

Read Also: Cotton Purchasing Centers : ఏపీలో నేడు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (AP) లో 1,200 మంది జీవోఆర్‌టీ నంబరు 1207 కింద మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లు (Multipurpose Health Assistants) నియమితులయ్యారు. 2002 జులై 20న వీరి నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఆ తర్వాత కోర్టులు జారీ చేసిన ఉత్తర్వుల కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు.

అయితే అప్పటి రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వం మానవతా దృక్పథంతో 2013లో మళ్లీ కొత్తగా ఉద్యోగాల్లోకి (11 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉందని) తీసుకుంది. ఈ మేరకు ఆ తర్వాత కోర్టుల్లో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002 జులై 20న అప్పటి ప్రభుత్వం

వీటిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు తాజాగా ఆ నియామకాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వారందరికి ఊరట దక్కింది. ఈ మేరకు జస్టిస్‌ అరవింద్‌కుమార్, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

AP

2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి నియమించిన 1,200 మంది నియామకాలపై స్పష్టత వచ్చింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002 జులై 20న అప్పటి ప్రభుత్వం 2,324 MPHA పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ నియామకాల్లో అవకతవకలున్నాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

కొత్తగా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది

హైకోర్టు విచారణ జరిపి, 2003 సెప్టెంబర్‌ 11న ఆ నియామకాలను రద్దు చేసింది. మెరిట్‌ జాబితాను మళ్లీ తయారుచేసి, కొత్తగా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో నష్టపోయినవారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులపై స్టేటస్‌కో విధించి, 2011 వరకు కేసును విచారించింది.

ఈలోగా, 2002 నోటిఫికేషన్‌ ప్రకారం నియమితులైనవారు 2011 వరకు ఉద్యోగాల్లో కొనసాగారు. చివరకు, 2011 ఆగస్టు 9న సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తుది తీర్పు వెలువరించింది. దీంతో, 2002 నోటిఫికేషన్‌ ప్రకారం నియమితులైన వారిలో 1,200 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది.సుదీర్ఘకాలం ఉద్యోగాలు చేసి, వయస్సు దాటిపోయిన వారిని మానవతా దృక్పథంతో ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అర్హత వయస్సు దాటిన వారికి కొత్తగా ఉద్యోగాలు

దీనికి స్పందించి, రాష్ట్ర ప్రభుత్వం 2013 ఆగస్టు 19న జీవోఆర్టీ నంబరు 1207 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం, అర్హత వయస్సు దాటిన వారికి కొత్తగా ఉద్యోగాలు కల్పించారు. అయితే ఈ నిర్ణయంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2002 నోటిఫికేషన్ ప్రకారం జరిగిన పరీక్షల్లో వీరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నవారు ఉన్నారు.

వారు ఈ నియామకాలను అన్యాయంగా భావించి, ఏపీ పరిపాలన ట్రైబ్యునల్, ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసును పరిశీలించి, ఎక్కువ మెరిట్ ఉన్న అభ్యర్థులకే ప్రాధాన్యత ఇవ్వాలని తీర్పు చెప్పింది.

జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాలతోకూడిన ధర్మాసనం

తక్కువ మెరిట్ ఉన్నవారిని తొలగించి, అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించాలని ఆదేశించింది.జీవో ఆర్టీ నంబరు 1207 కింద నియమితులైన అభ్యర్థులు ఈ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.

ఈ జీవో కింద జరిపిన నియామకాలను ఆమోదించాలని కోర్టును విన్నివించింది. ‘2002 నోటిఫికేషన్‌ ప్రకారం పరీక్ష రాసినవారు మెరిట్‌ ప్రాతిపదికన మళ్లీ ఉద్యోగాలు క్లెయిమ్‌ చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వండి’ అని కూడా కోర్టును కోరింది.

జస్టిస్‌ అరవింద్‌కుమార్, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాలతోకూడిన ధర్మాసనం ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని.. తాజాగా ఈ 1,200 మంది నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

AndhraPradesh Breaking News CourtVerdict HealthAssistants latest news SupremeCourt Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.