📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: AP: భవానీపురంలో కూల్చివేతలపై సుప్రీంకోర్టు నుంచి ఊరట

Author Icon By Rajitha
Updated: December 4, 2025 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ (Vijayawada) భవానీపురం పరిధిలోని జోజి నగర్‌లో ఇళ్ల కూల్చివేతల కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం లక్ష్మీ రామా కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు 42 ప్లాట్లను ఖాళీ చేయించేందుకు పెద్ద పోలీస్ బందోబస్తుతో తరలివచ్చి 16 ఇళ్లను కూల్చివేశారు. మిగతా యజమానులు, వారి కుటుంబ సభ్యులు దీనికి ప్రతిఘటన చూపగా, సూప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాల వచ్చే వరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Read also: AP Schools: ఆంధ్రా స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్

Supreme Court gives relief on demolition

ఈ నెల 31 వరకు కూల్చివేత ప్రక్రియ

తమ ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ, బాధితులు సిటార సెంటర్ సమీప బైపాస్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడు పెట్రోల్ వాడి ఆత్మహత్యకు ప్రయత్నించగా, పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. నిరసన కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు మరియు ఏసీపీ దుర్గారావు మధ్యన పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు జారీ కావడంతో బాధితులు తాత్కాలిక ఊరట పొందారు.

వివాద నేపథ్యానికి వస్తే, సుమారు 20 సంవత్సరాల క్రితం ఈ స్థల యజమాని లక్ష్మీ రామా కోపరేటివ్ సొసైటీకి స్థలాన్ని అందించారు. అయితే సొసైటీ సభ్యులు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో, యజమాని 42 మంది వ్యక్తులకు భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు. పదేళ్ల తరువాత కోర్టు సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఆధారంగా సొసైటీ సభ్యులు ఇళ్లను ఖాళీ చేయడం ప్రారంభించారు. సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాలు ఈ నెల 31 వరకు కూల్చివేత ప్రక్రియను నిలిపివేయాలని తెలిపారు, దీని వల్ల బాధితులు తాత్కాలిక ఊరట పొందారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Bhavanipuram House Demolition Jogi Nagar latest news Supreme Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.