ఆంధ్రప్రదేశ్ (AP) లోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, aided, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో ఈ నెల సమ్మేటివ్ పరీక్షలు (Summative Assessments) జరగనున్నాయి. ఈ పరీక్షల తేదీలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ (School Education Department) అధికారికంగా ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం, సమ్మేటివ్ పరీక్షలు (Summative tests) ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరగనున్నాయి.
Read Also: London: ఆసియా-2026 ర్యాంకింగ్స్‌లో భారత్ కు చోటు
విద్యాశాఖ తెలిపిన వివరాల ప్రకారం, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడతాయి. 6వ, 7వ తరగతుల విద్యార్థులకు మాత్రం మధ్యాహ్నం 1.15 గంటల నుండి సాయంత్రం 4.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఇక 8వ, 9వ, 10వ తరగతుల విద్యార్థులకు పరీక్ష సమయం ఉదయం 9.15 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్ణయించారు.ఆయా తరగతుల పరీక్ష పేపర్ల నమూనా వివరాలను షెడ్యూల్‌లో పొందుపరిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: