AP Subsidy Scheme: రైతుల ఆదాయాన్ని పెంచి, పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘గోకులం షెడ్లు'(Gokulam Sheds) పథకాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఈ పథకం కింద పశుపోషకులకు 90 శాతం వరకు, గొర్రెలు, మేకలు మరియు కోళ్ల పెంపకందారులకు 70 శాతం వరకు సబ్సిడీతో షెడ్లు మంజూరు చేస్తోంది. ఒక్కో గోకులం షెడ్డుకు రూ.1.15 లక్షల నుంచి రూ.2.30 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది.
అర్హులైన రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు మరియు జాబ్‌కార్డ్‌లను జతపరచి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ వంటి పథకాలతో పాటు ఈ పథకం రైతులకు పెద్ద ఉపశమనాన్ని అందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: CBN: సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
గతేడాది మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో గోకులం షెడ్లు నిర్మించబడ్డాయి. రెండో విడత కేటాయింపులు కూడా పూర్తయ్యాయి, త్వరలోనే వీటి నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. మొదటి విడత పనుల బిల్లులు కేంద్రం విడుదల చేయాల్సి ఉన్నందున ఆ ప్రాసెస్ పూర్తి కాగానే రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు తెలిపారు.
ఈ షెడ్లతో పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు సురక్షితంగా ఉంచుకునే అవకాశం లభించడం వల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయానికి అనుబంధ రంగాలను బలపరచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
రాయితీలు ఇలా ఉంటాయి:
- పశువుల షెడ్లు (2, 4, 6 పశువుల కోసం):
మొత్తం ఖర్చులో 90% సబ్సిడీ – రైతు వాటా కేవలం 10%- 2 పశువుల షెడ్: రూ.1.15 లక్షలు
- 4 పశువుల షెడ్: రూ.1.85 లక్షలు
- 6 పశువుల షెడ్: రూ.2.30 లక్షలు
- గొర్రెలు, మేకల (20/50 యూనిట్లు):
మొత్తం రూ.1.30 లక్షలు / రూ.2.30 లక్షలు — 70% సబ్సిడీ - కోళ్ల షెడ్లు (100/200 యూనిట్లు):
రూ.87,000 / రూ.1.32 లక్షలు — 70% సబ్సిడీ
రైతులు కేవలం తమ వాటా చెల్లిస్తే సరిపోతుంది.
ఈ విధంగా ప్రభుత్వం అందిస్తున్న సౌలభ్యాలతో అర్హులైన రైతులు తమ పశువులు, కోళ్లు, గొర్రెల కోసం ఆధునిక, సురక్షితమైన షెడ్లను నిర్మించుకోవచ్చు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: