ఆంధ్రప్రదేశ్‌లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు (AP Intermediate Board) ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు జరగనున్నాయి.
AP: ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభం – 2.90 లక్షల మందికి లబ్ధి
ఆయా రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని ఏపీ ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
అలాగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే ఇది తాత్కాలిక షెడ్యూల్ మాత్రమేనన్న ఇంటర్మీడియట్ బోర్డు.. పరిస్థితులను అనుసరించి షెడ్యూలులో మార్పు చేసే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి
మరోవైపు ఈసారి నెల ముందుగానే ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ పరీక్షలను ఫిబ్రవరిలోనే నిర్వహించాలని ఏపీ ఇంటర్ బోర్డు గతంలో నిర్ణయించింది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఇప్పటి వరకూ మార్చి నెలలో జరిగేవి.
అయితే సీబీఎస్‌ఈతో పాటుగా ఈసారి నుంచి ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. అలాగే ఏప్రిల్ నుంచి ఇంటర్ తరగతులను నిర్వహించడం కోసం పరీక్షలన్నీ ముందే పూర్తవుతాయి. అలాగే పరీక్షల విధానంలోనూ ఈసారి మార్పులు జరిగాయి. తొలుత సైన్స్ గ్రూప్ విద్యార్థులకు గ్రూపు సబ్జెక్టులతో పరీక్షలు నిర్వహిస్తారు.
ఇతర సబ్జెక్టులకు పరీక్షలు ఉండేవి
రోజూ ఓ సబ్జెక్ట్ మీద పరీక్ష ఉంటుంది. ఉదాహరణకు గతంలో ఎంపీసీ విద్యార్థులకు (MPC students) సబ్జెక్టు పరీక్ష ఉంటే.. ఆ రోజు ఆర్ట్స్, బైపీసీ గ్రూపుల విద్యార్థులకు ఇతర సబ్జెక్టులకు పరీక్షలు ఉండేవి.అయితే ఇప్పుడు పరీక్షల విధానం మారింది. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్ పరీక్ష ఉంటే ఆ రోజు కేవలం ఆ సబ్జెక్టు మీద పరీక్ష మాత్రమే ఉంటుంది.
ఎందుకంటే ఇటీవల ఎంబైపీసీ గ్రూపును తీసుకువచ్చారు. దీంతో ఎంపీసీ విద్యార్థులకు కూడా జువాలజీ చదివే అవకాశం ఉంటుంది. అయితే ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక.. ఒక రోజు ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. సైన్స్ గ్రూపు విద్యార్థుల (Science group students) సబ్జెక్ట్ పరీక్షలు పూర్తయ్యాక ఆఖరిలో లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహిస్తారు.
ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూపు పరీక్షలు ప్రారంభమవుతాయి.మరోవైపు జనరల్ కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే ఒకేషనల్ కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రాక్టికల్ పరీక్షలు రెండు సెషన్లలో ఉంటాయని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: