AP Students: పబ్లిక్ పరీక్షలు.. హాల్ టికెట్ చూపిస్తే విద్యార్థులకు ఫ్రీ జర్నీ

Read Time:  1 min
AP Students: పబ్లిక్ పరీక్షలు.. హాల్ టికెట్ చూపిస్తే విద్యార్థులకు ఫ్రీ జర్నీ
FONT SIZE
GET APP

AP Students: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారు.

Read Also: Hyatt Regency: నారా లోకేష్ ముంబై పర్యటన ఖరారు

AP Students: పబ్లిక్ పరీక్షలు.. హాల్ టికెట్ చూపిస్తే విద్యార్థులకు ఫ్రీ జర్నీ
AP Students: Public exams.. Free journey for students if they show their hall ticket

హాల్‌టికెట్ చూపిస్తే చాలు.. రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణం!

ఈ సదుపాయం ప్రకారం, విద్యార్థులు తమ వెంట కేవలం పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్ (Hall Ticket) ఉంచుకుంటే సరిపోతుంది. బస్సులో కండక్టర్‌కు హాల్‌టికెట్ చూపించి, ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి, తిరిగి ఇంటికి ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు ఈ సదుపాయం అందుబాటులో ఉండగా, త్వరలో ప్రారంభం కానున్న పదో తరగతి (SSC) విద్యార్థులకు కూడా దీనిని వర్తింపజేసే అవకాశం ఉంది.కాగా, గత సంవత్సరం కూడా ఉచిత ప్రయాణాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.