ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న అడుగు వేసింది. రాష్ట్రంలోని యువత (AP Students) కు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృత్రిమ మేధ (Artificial Intelligence – AI) ఆధారంగా రూపొందించిన ప్రత్యేక పోర్టల్ — ‘నైపుణ్యం’ — ను త్వరలో ప్రారంభించనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సు (Partnership Summit)లో ఈ పోర్టల్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ దేశంలోనే తొలిసారి అమలు కాబోవడం విశేషం.
Read Also: AP: ఉపరితల ఆవర్తనంతో ఈ జిల్లాల్లో వర్షాలు
‘నైపుణ్యం’ పోర్టల్ (‘Skill’ portal) లక్ష్యం యువత సామర్థ్యాలను సరిగ్గా అంచనా వేసి, వారికి తగిన శిక్షణా అవకాశాలు, ఉద్యోగ మార్గాలను చూపడం. ఇప్పటి వరకు సాధారణంగా రాతపరీక్షలు లేదా ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల నైపుణ్యాలు అంచనా వేయబడుతుండగా,
ఈ కొత్త పోర్టల్‌లో ఏఐ (AI) టెక్నాలజీ ద్వారా అభ్యర్థుల ప్రొఫైల్‌ను విశ్లేషించి,వారి నైపుణ్య స్థాయిని అంచనా వేసి, ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తిస్తుంది. అంతేకాకుండా, అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి ఏఐ సహాయంతో సులభంగా తమ రెజ్యూమెను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో తయారు చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ-శ్రమ్
ఈ పోర్టల్‌ను అత్యంత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న కీలక డేటాను అనుసంధానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ-శ్రమ్, ఆధార్, డిజి లాకర్, ఈపీఎఫ్ వంటి వివరాలతో పాటు, రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఉద్యోగుల వివరాల వరకు అన్నింటినీ దీనికి లింక్ చేస్తున్నారు.
దీనివల్ల అభ్యర్థి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నారా? లేదా? ఇచ్చిన వివరాలు వాస్తవమా? కాదా? అనే విషయాలను నిర్ధారించుకోవచ్చు.నిరుద్యోగులకు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు మధ్య వారధిగా ఈ పోర్టల్ పనిచేస్తుంది. నౌకరీ, విజన్ ఇండియా వంటి ప్రముఖ జాబ్ పోర్టల్స్‌తో పాటు ఇన్ఫోసిస్, యునిసెఫ్ వంటి సంస్థల లెర్నింగ్ ప్లాట్‌ఫాంలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.
ఆస్క్ విద్య’ అనే వర్చువల్ అసిస్టెంట్
కంపెనీలు తమ పాన్ కార్డు వివరాలతో నేరుగా రిజిస్టర్ చేసుకొని, తమకు కావాల్సిన ఉద్యోగ ఖాళీల వివరాలను నమోదు చేయవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగాల సమాచారం ఇక్కడ కనిపిస్తుంది.‘ఆస్క్ విద్య’ అనే వర్చువల్ అసిస్టెంట్ ద్వారా అందుబాటులో ఉన్న కోర్సులు, శిక్షణా కేంద్రాల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అభ్యర్థులు తమకు నచ్చిన కోర్సును ఎంచుకొని, సమీపంలోని నైపుణ్య కళాశాలలో చేరవచ్చు.
శిక్షణ పూర్తయ్యాక, ఏఐ వారి పురోగతిని మదింపు చేస్తుంది. మొత్తం మీద, ‘నైపుణ్యం’ పోర్టల్ ద్వారా ఒకే వేదికపై శిక్షణ, సామర్థ్యాల అంచనా, ఉద్యోగ అవకాశాల కల్పన వంటి అన్ని సేవలను అందించి, యువత (AP Students) కు ఉపాధి మార్గాలను సులభతరం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: