కిట్ల పంపిణీ కోసం సక్రమమైన షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో(AP) చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరానికి ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లు అందించేందుకు ప్రభుత్వం కృషి ఈ కిట్లలో క్లాస్ బుక్స్, యూనిఫార్మ్‌లు, బూట్లు, సాక్సులు, బెల్టు, నోట్‌బుక్స్ లాంటి విద్యార్థులకు అవసరమైన సామగ్రి ఉంటాయి. కిట్లను సమయానికి విద్యార్థులకు అందించడానికి ప్రభుత్వం నవంబర్ నెలలోనే అనుమతులు, కమిటీ ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్‌లో టెండర్ల ప్రకటన, జనవరిలో వాటి ఖరారు, ఫిబ్రవరిలో నాణ్యత పరిశీలన, మే నెలలో జిల్లాలు, మండలాలకు పంపిణీ, చివరగా జూన్ 12న విద్యార్థులకు కిట్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Read also: శబరిమల యాత్రలో జగన్ బ్యానర్లు కలకలం
కట్టుదిట్టమైన ప్రణాళికతో సకాలంలో పంపిణీ
ప్రభుత్వం(Government) ఈ కిట్ల సేకరణ, తయారీ, సరఫరా ప్రక్రియను(AP) వేగవంతం చేయడానికి కట్టుదిట్టమైన షెడ్యూల్ రూపొందించింది. నవంబరులో పరిపాలన, ఆర్థిక అనుమతులు, టెక్నికల్ కమిటీ ఏర్పాట్లు, డిసెంబర్‌లో టెండర్ డాక్యుమెంట్ సిద్ధం, రెండో వారంలో ప్రకటన విడుదల, జనవరిలో టెండర్లు ఖరారు, ఫిబ్రవరిలో నమూనాల నాణ్యత పరిశీలన, మే నెలలో జిల్లా, మండల స్టాక్ పాయింట్లకు సరఫరా, జూన్ 12న పాఠశాలల్లో విద్యార్థులకు కిట్ల అందజేతను ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా అమలు చేస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: