📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

AP: ఉపాధి హామీ పథకంలో కఠిన నిర్ణయం.. భారీగా జాబ్ కార్డులు రద్దు

Author Icon By Rajitha
Updated: December 19, 2025 • 4:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ కూలీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద జారీ చేసిన జాబ్ కార్డులు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. అధికారుల లెక్కల ప్రకారం, అక్టోబర్ 10 నుంచి నవంబర్ 14 మధ్య కేవలం ఐదు వారాల వ్యవధిలోనే ఏకంగా 11.07 లక్షల జాబ్ కార్డులు తొలగించారు. దేశవ్యాప్తంగా ఈ కాలంలో రద్దైన మొత్తం జాబ్ కార్డుల్లో 68 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే (AP) చెందినవిగా ఉండటం గమనార్హం.

Read also: AP: డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

AP

కేవైసీ తప్పనిసరి చేయటంతో

2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఏపీలో మొత్తం 18.38 లక్షల జాబ్ కార్డులు రద్దయ్యాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ సంఖ్య అత్యధికం. దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో లక్షలోపు జాబ్ కార్డులే రద్దుకాగా, ఒడిశాలో 80,896, జమ్మూ కశ్మీర్‌లో 79,070 కార్డులు తొలగించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధికంగా ఉపాధి హామీ జాబ్ కార్డులు రద్దైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.

గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం తరచూ జాబ్ కార్డులపై సమీక్షలు చేపడుతోంది. చనిపోయిన వారు, దీర్ఘకాలంగా పనిచేయని వారు, వలస వెళ్లిన వారి కార్డులను తొలగించటం నిబంధనల ప్రకారం జరుగుతోంది. ఇటీవల జాబ్ కార్డులకు కేవైసీ తప్పనిసరి చేయటంతో రద్దుల సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి కేంద్రం రూ.7,707.21 కోట్ల నిధులు విడుదల చేయగా, రాష్ట్రంలో ప్రస్తుతం 51 లక్షల కుటుంబాలు, సుమారు 90 లక్షల కూలీలు ఉపాధి హామీ పథకం కింద నమోదు అయి ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh job cards latest news MGNREGA Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.