విజయవాడ : హజ్ యాత్ర కోసం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పునః కేటాయింపు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కు ముస్లిం సమాజం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా తెలియజేశారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా,. సభ్యులు కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించారు. ఆ విజ్ఞాపన పత్రంలో తెలియజేసిన అంశాలు… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం విడుదల చేయవలసిందిగా కోరుచున్నామన్నారు.
దానికి సంబంధించిన మార్గదర్శకాలను పేర్కొంటూ ప్రభుత్వ ఉత్తర్వులు (బివీ) జారీ చేయవలసిందిగా విజప్తి చేస్తున్నామన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :