📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP SSC Exams: ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

Author Icon By Saritha
Updated: March 16, 2026 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP SSC Exams: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. వీరి కోసం 3,415 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగుస్తాయి. పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. 38,958 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. మొత్తం విద్యార్థుల్లో 6,22,074 మంది రెగ్యులర్, 18,842 మంది ప్రైవేటు అభ్యర్థులు ఉన్నారు.

Read Also: Half-Day Schools : నేటి నుండి తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు

AP SSC Exams: 10th Grade Exams Begin Today in AP

విద్యార్థులకు ముఖ్య సూచనలు

పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ జరగకుండ 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మొదటిసారి 7,429 మంది ప్రైవేటు పాఠశాలల టీచర్లను సైతం ఇన్విజిలేటర్లుగా నియమించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మొదట ఓఎమ్మార్ షీట్పై ఫొటో, పేరు, నంబరును తప్పకుండా సరిచూసుకోవాలి. విద్యార్థులకు జవాబులు రాసేందుకు 24 పేజీల బుక్ లెట్ ఇస్తారు. దీన్ని పూర్తిగా రాసిన తర్వాత అవసరమైతే అదనంగా 12 పేజీల బుక్ లెట్ ఇస్తారు.

విద్యార్థులు ఉదయం 8:30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా హాల్‌లోకి ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, క్యాలిక్యులేటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని విద్యాశాఖ పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

10th Class Exams Andhra Pradesh AP SSC Exams 2026 education department Exam Center Guidelines SSC Exam Rules

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.