📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: AP: శ్రీ లక్ష్మిపై అభియోగాలకు ఆధారాలు తేలిన అంశంపై మళ్లీ పిటిషన్ చెల్లదు..

Author Icon By Saritha
Updated: December 6, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘పెన్నా’ కేసులో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సిబిఐ

విజయనాడ : ఐఏఎస్ అధికారిణీ వై. శ్రీలక్ష్మి జగన్(AP) అక్రమాస్థుల వ్యవహారంలో భాగంగా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడైన ప్రతాప్రెడ్డికి చెందిన పెన్నా సిమెంట్స్ కు లీజుల మంజూరులో అప్పటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలకు ఆధారాలున్నాయని సిబిఐ తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఉమ్మడి ఏపీలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా వ్యవహరించిన శ్రీలక్ష్మిపై కేసును కొనసాగించడానికి సీబీఐ అన్ని ఆధారాలను సేకరించిందని తెలిపింది. అంతే కాకుండా గతంలో తేలిన అంశంపై మళ్లీ పిటీషన్ వేయడానికి వీల్లేదని పేర్కొంది. పెన్నా ప్రతాప్రెడ్డికి చెందిన పెన్నా సిమెంట్స్కు అనంతపురంజిల్లా యాడికిలో 231 ఎకరాల భూకేటాయింపు, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం కౌలపల్లిలో 304.70 హెక్టార్లలో ప్రాస్పెక్టింగ్లోజు, రంగారెడ్డి జిల్లా తాండూరులో 822.13 ఎకరాల్లో లీజు రెన్యువల్తో పాటు హైదరాబాద్లో వయనీర్ హోటళ్ళ నిర్మాణాలకు రాయితీల కల్పనలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, ఇందుకు గాను వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడైన జగన్మోహనరెడ్డికి(Jagan Mohan Reddy) చెందిన కంపెనీల్లో ప్రతాల్రెడ్డి రూ.68 కోట్లు పెట్టు బడులు పెట్టినల్లు సిబీఐ కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇందులో నిందితురాలిగా ఉన్న అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి వై. శ్రీలక్ష్మి తనపై కేసును కొట్టి వేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్పై జస్టిస్ జూలకంటి అనిల్ కుమార్ గురువారం విచారణ చేపట్టారు.

Read also: కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా: పరాగ్

CBI reports to Telangana High Court in ‘Penna’ case

శ్రీలక్ష్మిపై అభియోగాలకు ఆధారాలున్నాయని సీబీఐ నివేదన

సీబీఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపిస్తూ అభియోగ పత్రాన్ని కాగ్నిజెన్స్ తీసుకుంటూ, సిబీఐ కోర్టు(AP) ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీలక్ష్మి గతంలోనే. పిటీషన్ దాఖలు చేశారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయి తీర్పు రిజర్వు అయిన తర్వాత ఉపసంహరించుకున్నారన్నారు. అంటే అవే తుది ఉత్తర్వులని, మళ్ళీ అదే అభియోగాలకు ఆధారాలు కాగ్నిజెన్స్ ఉత్తర్వులను సవాలు చేసూప్త మళ్ళీ వేయడానికి వీల్లేదన్నారు. ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తరువ్లపై అభ్యంతరాలుంటే కింది కోర్టులో తేల్చుకోవాలని, ఈ కోర్టులో కాదని తెలిపారు. అందువల్ల పిటీషను కొట్టివేయాలని కోరారు. శ్రీలక్ష్మి తరపున సీనియర్ న్యాయవాది కె.వివేక్రెడ్డి వాదనలు వినిపిస్తూ గతంలో పిటీషన్లో వాదనలు పూర్తయ్యాక ప్రాసిక్యూషన్కు అనుమతి మంజూరైందని, ఇదే విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్ళి పిటీషను ఉపసంహరించుకొని మళ్ళీ దాఖలు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం అవినీతి నిరోధక చట్టం కింద మాత్రమే అనుమతి ఉందని, ఐపీసీ కింద అభియోగాలపై విచారణకు అనుమతి మంజూరు కాలేదన్నారు. ఐపీసీ, పీసీ చట్టాల కింద అనుమతులు ఉండాల్సిందేనని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ప్రస్తావించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఉత్తర్వుల నిమిత్తం విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

CBI report IAS officer Illegal Assets Case Jaganmohan Reddy Latest News in Telugu Penna Case Penna Cement Telangana High Court Y Srilakshmi YS Rajasekhara Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.