ఫిబ్రవరి 10 నుంచి ఉత్సవాలు
శ్రీ కాళహస్తి : (AP) శ్రీకాళహస్తి మహాశివరాత్రి తిరునాళ్ళుకు ముస్తాబౌతుంది. ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల పనులు యుద్ధ ప్రాతిపదికపై సాగుతున్నాయి. ఇప్పటికే దేవస్థానం అధికారులు పనుల నిర్వహణలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే పనుల నిర్వహణ, ఇప్పటి వరకు జరిగిన పనులు వేపట్టాల్సిన పనులకు సంబంధించి శాసనసభ్యుడు బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి, ధర్మకర్తల మండలితో కలసి సమావేశం నిర్వహించి సూచించారు. కాగా జిల్లా కలెక్టర్, ఎసిపిలు మరోసారి సమీక్షించారు. పలు సూచనలు చేసారు.
ఆలయ ఇఓ జె. బాపి రెడ్డి గత ఏడాది చేసిన పనుల అనుభవం ఉండటంతో ఇంజనీరింగ్ అధికారులను పరుగులు తీయిస్తున్నారు. భక్తుల బస సదుపాయాలకు, సాంస్కృతిక వేదిక రూపకల్పనతో పాటు పార్కింగ్, సిసి కెమెరాల ఏర్పాటు, స్వర్ణముఖి నదిలో భక్తులకు స్నానాలు, గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది పనుల్లో వేగం పెరిగింది. ఇప్పటికే దాదాపు పనులు పూర్తి కావచ్చాయి. ఇక ఇంజనీరింగ్ విభాగం పనుల్ని ఇఇ శ్రీనివాసులురెడ్డి సారధ్యంలో రధాలు, నారదపుష్కరిణిలో తెప్పలకు సంబంధించి పరిశీలన జరుపుతున్నారు. బందోబస్తుకు సంబంధించి వచ్చే సుమారు 1000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: AP: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ భేటీ
భోళాశంకరుని సన్నిధిలో రంగవల్లులు
దక్షిణకైలాసంగా పేరుపొందిన శ్రీకాళహస్తి (Srikalahasti) పట్టణంలో మహాశివరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. (AP) ఆలయంలో విద్యుత్ దీపాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే సంప్రదాయాలకు పెద్దపీట వేసినట్లు రూపుదిద్దుతున్నారు. ఆలయం అంతా రంగురంగుల ముగ్గుల మయం చేస్తున్నారు. ఇక విద్యుత్ దీపాలంకరణలో చూడటానికి వేయి కళ్ళు చాలవన్నట్లు మారింది. ఇక బిక్షాల గాలిగోపురానికి అమర్చిన ‘ఓం నమఃశివాయ అనే నూయాన్ లైటింగ్ ఇటు తేరువీధి, అటు బజారువీధులను పాల వెలుగుల్లా మార్చేసింది. ఊరంతా పండగ అన్నట్లు మారింది. ఈ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు ఇఓ బాపి రెడ్డి సూచనల మేరకు ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించుకుంటూ శివరాత్రిని బ్రహ్మాండంగా నిర్వహించుటకు చర్యలు తీసుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: