📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Telugu News: AP: వేగంగా జరుగుతున్న శ్రీకాకుళం ఫ్లైఓవర్

Author Icon By Tejaswini Y
Updated: November 10, 2025 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో(AP) జాతీయ రహదారి పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. కేంద్రం సహకారంతో అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం కూడలిలో నేషనల్ హైవే విస్తరణలో భాగంగా రూ.242 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతోంది.

బైపాస్ వివాదం తర్వాత కొత్త ప్రణాళిక

మునుపు రణస్థలంలో బైపాస్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించగా, భూసేకరణ వివాదాల కారణంగా ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. దాంతో, ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) అదే ప్రదేశంలో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తగ్గి, వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి.

Read Also: AP: సొంతింటి కల నెరవేర్పు ..పొడిగిచిన గడువు

వర్షాల అనంతరం వేగంగా నిర్మాణం

ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ పనులు వర్షాకాలం కారణంగా కొంత మందగించాయి. ఇప్పుడు వర్షాలు తగ్గడంతో మళ్లీ పూర్తి ఊపందుకున్నాయి. ఇప్పటికే 15 శాతం పనులు పూర్తయ్యాయని గుత్తేదారు సంస్థ తెలిపింది.

ట్రాఫిక్ డైవర్షన్ అమల్లోకి

వంతెన నిర్మాణం కారణంగా ఈ నెల 11వ తేదీ నుంచి తాత్కాలికంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. శ్రీకాకుళం–విశాఖ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఈ మార్పులను గమనించాలి. తహసీల్దార్ కార్యాలయం నుంచి సీఐ కార్యాలయం వరకు, పోలీసు స్టేషన్ నుంచి విద్యుత్ ఉపకేంద్రం వరకు ఉన్న సర్వీసు రోడ్లపై వాహనాలను అనుమతించడం లేదు.

ఆధునిక సదుపాయాలతో నిర్మాణం

వంతెనకు అవసరమైన ఇనుప గడ్డర్లను దన్నానపేటలో ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత సంస్థ పదేళ్ల పాటు పైవంతెన నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించనుంది. దీనిలో శుభ్రత, మరమ్మతులు వంటి పనులు కూడా ఉంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AndhraPradeshNews APDevelopment FlyoverConstruction InfrastructureInAP NationalHighwayExpansion NHAI RanastalamProject RoadDevelopment SrikakulamFlyover

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.