📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

AP Sports: క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం: ఛైర్మన్ అనిమిని రవినాయుడు

Author Icon By Rajitha
Updated: January 5, 2026 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: ఆంధ్రప్రదేశను క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ. రాష్ట్రంలో మీడియా సమావేశంలో క్రీడా యాప్ సమాచార పత్రాన్ని ప్రదర్శిస్తున్న శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు
క్రీడలను ఉద్యమంగా మార్చి, ప్రతి జిల్లాలో మోలిక వసతులు కల్పించి, అంతర్జాతీయ స్థాయి. క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శాప్ ఛైర్మన్ స్పష్టం చేశారు. ఈ
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో క్రీడాకారులకు రావాల్సిన బకాయిలుగా సుమారు రూ.16 కోట్లను ఇప్పటికే విడుదల చేసినట్లు, అలాగే ఫిబ్రవరి నెలలో మరో రూ.8 కోట్లను క్రీడాకారులకు అందించనున్నట్లు తెలిపారు.

Read also: SriSathyaSai District: పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య

The welfare of the athletes is our goal

రాష్ట్రానికి సమగ్ర క్రీడా పాలసీ లేకపోవడంతో

ఈ సుధీర్ఘ క్రీడా అభివృద్ధి ప్రయాణంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని అనిమిని రవి నాయుడు పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో రాష్ట్ర క్రీడా శాఖకు, ముఖ్యంగా క్రీడాకారుల సంక్షేమం మరియు క్రీడా రంగ అభివృద్ధికి నిరంతర సహకారం అందించిన మీడియా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 2026 సంవత్సరంలో కూడా ఇదే విధంగా మీడియా మద్దతు కొనసాగాలని ఆకాంక్షించారు. గతంలో రాష్ట్రంలో క్రీడా విభాగానికి స్పష్టమైన క్రీడా విధానం లేకుండా, సరైన మోలిక వసతులు లేక నిద్రాణావస్థలో కొనసాగిందని తెలిపారు. తాను చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రానికి సమగ్ర క్రీడా పాలసీ లేకపోవడంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రానికి సమగ్ర క్రీడా పాలసీని ప్రకటించడం జరిగిందన్నారు. ఈ పాలసీ రూపకల్పనలో మీడియా ప్రతినిధులు, క్రీడా సంఘాలు, ప్లేయర్స్ అసోసియేషన్ల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని, అవసరమైన మార్పులు, సవరణలు త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏసియన్ గేమ్స్ లను లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న విధానాన్ని రాష్ట్రంలోనూ అనుసరించేందుకు

విజయనగరంలో ఈ ఏడాదే స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు

నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ దిశగా క్రీడల్లో ముందున్న తమిళనాడు సహా దాదాపు 17 రాష్ట్రాల క్రీడా విధానాలు, పనితీరును అధ్యయనం చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి కోసం సుమారు రూ.54 కోట్ల విలువైన ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి చేసి, అన్ని ప్రాంతాల్లో పారదర్శకంగా పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. శాశ్వత క్రీడా మోలిక వసతుల అభివృద్ధి భాగంగా శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధి పనులు
జరుగుతున్నాయని, విశాఖపట్నం కొమ్మాదిలో సుమారు రూ.25 కోట్లతో ఆధునిక స్టేడియం నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. విజయనగరంలో ఈ ఏడాదే స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

అలాగే అరకు-పాడేరు ప్రాంతాల్లో క్రీడల్లో ప్రతిభ ఉన్న గిరిజన పిల్లల కోసం ఎస్టీ కంపోనెంట్ నిధులు, స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కాకినాడలో ఖేలో ఇండియా పథకం కింద సింథటిక్ ట్రాక్ పూర్తి చేసి, అక్కడే క్రీడా అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వాటర్ గేమ్స్ తో పాటు మల్టీ పర్పస్ స్పోర్ట్స్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. రాజమండ్రిలో అమరావతి పుష్కరాల పేరుతో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం ఇప్పటికే ప్రారంభమైందని, అలాగే ఏలూరులోవెయిట్ లిఫ్టింగ్ తదితర క్రీడలకు అనుకూలంగా సుమారు రూ.8 నుండి రూ.10 కోట్లతో మరమ్మత్తుల పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కీలక క్రీడా మైదానాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Animini Ravinayudu AP Sports latest news sports policy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.