📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: AP: మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ

Author Icon By Rajitha
Updated: October 22, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: విజయవాడ : సమాజంలోని ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లడం ద్వారా ముస్లిం మైనారిటీలు అన్ని రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ (N Md Farooq) పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కంపానియన్ షిప్ సంస్థ ఆధ్వర్యంలో సీసిసి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రి ఫరూక్, మాజీ ఎమ్మెల్సీ, టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు టిడి జనార్ధన్ తో పాటు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.

Read also: Chandrababu Naidu: కుప్పానికి ‘సుర్బానా‘చే మాస్టర్ ప్లాన్

AP: మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ

ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయపరంగా, అన్ని రంగాలలో ముస్లింలు ముందంజ వేయడానికి, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి కార్యోన్ముఖులుగా ముందుకు సాగాలని మంత్రి ఫరూక్ అన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ముస్లిం కుటుంబాల్లో ఆర్థిక పరిపుష్టి కోసం విరివిగా రుణ సదుపాయాలను అందించడం జరుగుతుందని అన్నారు. విద్యాపరంగా ఉన్నత కోర్సులకు, నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదల సమయంలో ప్రత్యేక శిక్షణ ఏర్పాట్లు, ఉర్దూ భాషాభివృద్ధికి క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని అన్నారు. కంపానియన్ షిప్ సంస్థ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల నిర్వాహకుల బృందాన్ని మంత్రి ఫరూక్ అభినందించారు.

కంపానియన్ సంస్థ సేవలను ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండే రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల, కర్నూలు, కడప ప్రాంతాలలో కూడా విస్తరింపచేయాలని మంత్రి సూచించారు. ముస్లింలు అన్ని రంగాలలో రాణించడానికి వీలు కలిగించే అన్ని కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి ఫరూక్ హామీ ఇచ్చారు. ముస్లిం సామాజిక వర్గానికి విద్య, క్రీడలు, వ్యాయామం తదితర రంగాలలో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వారికి అవార్డులను, ప్రశంసా పత్రాలను మంత్రి ఫరూక్, మాజీ ఎమ్మెల్సీ టీడి జనార్ధన్, ఫరూక్ షిబ్లీ చేతుల మీదుగా కంపానియన్ షిప్ సంస్థ ప్రతినిధులు అందజేశారు. రాష్ట్రంలో ముస్లిం సమాజం తరఫున సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని గుర్తించి వారి ప్రతిభను జనాల్లోకి తీసుకొని వెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో కూడా కంపానియన్ షిప్ సంస్థ నిర్వహిస్తుందని సిసిసి అవార్డుల నిర్వాహకులు షబ్బీర్, సిరాజ్, మన్సూర్ పేర్కొన్నారు.

ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి మంత్రి ఫరూక్ ఏమి సూచించారు?
విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ముస్లింలు ముందుకు రావాలని, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల కోసం ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతోంది?
రుణ సదుపాయాలు, ఉన్నత విద్యకు శిక్షణ, ఉద్యోగాల కోసం ప్రత్యేక కోచింగ్, ఉర్దూ భాషాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh News latest news Minority Welfare Muslim development NMD Farooq Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.