విజయవాడ : (AP) ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసువిచారణలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను విచారించడం ద్వారా ఈ కుంభకోణంలో ఎవరెవరి హస్తం ఉంది, నిధుల మళ్లింపు ఎలా జరిగింది అనే కోణంలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు ప్రధాన నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. రోనక్ కుమార్ను మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి కోర్టు అనుమతించింది. రోనక్ కుమార్ను సిట్ కార్యాలయానికి తరలించి, ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి.
Read Also: Tirupati District: రంగంపేటలో అంబరాన్నంటిన జల్లికట్టు సంబరాలు
విజయవాడ జిల్లా జైల్లోనే విచారణ
మద్యం సరఫరా, లైసెన్సుల మంజూరులో జరిగిన అవకతవకలపై ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. అనిల్ చోక్రాను ఒక రోజు పాటు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. (AP) అయితే భద్రతా కారణాల దృష్ట్యా అనిల్ చోక్రాను విజయవాడ జిల్లా జైల్లోనే విచారించాలని నిర్ణయించారు. సిట్ అధికారులు ఇప్పటికే విజయవాడ జిల్లా (Vijayawada) జైలుకు చేరుకుని అనిల్ చోక్రాను విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. లిక్కర్ పాలసీలో జరిగిన లోపాలు, ఇతర నిందితులతో ఉన్న సంబంధాల గురించి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు.. గుంటూరు జైల్లో ఉన్న మరికొంత మంది రిమాండ్ ఖైదీల గురించి కూడా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: