📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: AP Short Film: ఎపి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ

Author Icon By Rajitha
Updated: November 25, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంటూరు : ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ‘మా ఏపి’ అత్యంత ప్రతిష్టాత్మకగా 2026 జనవరి 4న తెనాలిలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ (short film) ఫెస్టివల్ పోస్టర్ను కన్వీనర్, సినీ దర్శకుడు దిలీప్ రాజా విడుదల చేశారు. మా ఏపి కార్యాలయలో సోమవారం జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ పోటీలు కేవలం ఆంధ్రప్రదేశ్ లోని ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించ్నేదుకు మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా ఈ షార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల ఎంట్రీలకు ప్రవేశం లేదన్నారు. 15 నిమిషాల నిడివి మించకుండా డిసెంబర్ 25 లోగా షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలను “మా ఏపీ కార్యాలయం, ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలి 522 202″ చిరునామాకు పెన్ డ్రైవ్ తో నటీనటుల ఆధార్ కార్డులు, ఫోటోలు జతపరచి పంపించి వలసిందిగా” ఆయన తెలిపారు. కథాంశాలలో ఏమతాన్ని, కులాన్ని, రాజకీయ పార్టీలను విమర్శించకుండా కంటెంట్ ఉండాలని దిలీప్ రాజా వివరించారు.

Read also: Andhra Pradesh: ఏ క్షణమైనా జాబ్ క్యాలెండర్ విభాగాల వారీగా ఖాళీల సమాచార సేకరణ పూర్తి

AP Short Film Festival poster unveiled

బహుమతిగా 50 వేల రూపాయలు

సమాజంపై విషం చిమ్ముతున్న కొన్ని వ్యవస్థలు, తల్లిలాంటి దేశ భద్రత కు సవాళ్ళుగా నిలిచిన కొన్ని శక్తులపై కెమెరా కన్ను పెట్టాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కథాంశాలను ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ దర్శక నిర్మాతలదేనని ఆయన స్పష్టం చేశారు. విజేతలకు సూపర్ స్టార్ కృష్ణ స్మారక ప్రధమ బహుమతిగా 50 వేల రూపాయలు, మహానటి సావిత్రి స్మారక ద్వితీయ బహు మతికి 30 వేలు, కొంగర జగ్గయ్య స్మారక తృతీయ బహుమతికి 20 వేలు, గుమ్మడి వెంకటేశ్వరరావు, జమునల పేరుతో రెండు కన్సోలేషన్ బహుమతులకు 20 వేల రూపాయల నగదు బహుమతులు అందజేస్తామని కో కన్వీనర్, దర్శ కుడు అచ్చన శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. తెనాలిలో ఈ షార్ట్ ఫిల్మ్ షూటింగులు తీసుకునే యూనిట్లకు లొకేషన్లు, ట్రాక్ ట్రాలీ, బేబీ, జూనియర్, 2 కెవి లైట్లు, రిఫ్లెక్టర్లు ఉచితంగా మా ఏపి అందిస్తుందన్నారు.

కార్యక్రమంలో దర్శకుడు గాజులపల్లి రాముడు

ఉత్తమ నటుడు, నటి లాంటి వ్యక్తిగత బహుమతులను స్వర్గీయ గోవిందరాజుల సుబ్బారావు, కాంచనమాల, ఏవీయస్, చక్ర పాణి, బొల్లిముంత శివరామ కృష్ణ, మోదు కూరి జాన్సన్, సభారంజని, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, ఏవీ సుబ్బారావు, కన్నెగంటి నాసరయ్య, ఆకుల వెంకయ్యల పేరిట విజేతలకు పర్మిన్నెట్ షీల్డ్, ప్రశంసాపత్రం అందుకుంటారని శ్రీనివాస యాదవ్ వివరించారు. కాగా ఎంట్రీ ఫారంతో పూర్తి నియమ నిబంధనలు తెలుసుకునేందుకు ఎంఏ ఏఏ-పియుఎన్ఐఓఎన్ జిమెయిన్. కామ్ కు మెయిల్ చేసి తెలుసుకోవచ్చని లేదా పై చిరునామాను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో దర్శకుడు గాజులపల్లి రాముడు, మా ఏపి సభ్యులు పినపాటి సురేష్ బాబు, మంచాల విజయ కిషోర్, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్, రోటేరియన్ కన్నెగంటి మురళి, కాకుమాను యర్రబాబు, కన్నెగంటి మధు పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AP-Film-Festival Dilip-Raja latest news Short-Film Telugu News tenali

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.