📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Latest news: AP: ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల మృతి

Author Icon By Saritha
Updated: November 19, 2025 • 4:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) మారేడుమిల్లి అడవి ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. బుధవారం తెల్లవారుజామున భద్రతా దళాలు మావోయిస్టుల (AP) మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరంతా ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. మృతుల్లో మావోయిస్టు కీలక నాయకుడు దేవ్‌జీ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సంఘటన తర్వాత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అడవి ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్‌ను పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారు.

Read also: భారత్‌పై కొత్త ఫిదాయీన్ దాడికి జైషే మహ్మద్ కుట్ర

Seven Maoists killed in encounter

ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించిన ఇంటెలిజెన్స్ అధికారులు

ఎన్‌కౌంటర్ జరిగిన విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ మహేశ్‌చంద్ర లడ్డా ధృవీకరించారు. ఆయన వివరాల్లో భాగంగా చెప్పారు తాజా కాలంలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రాంతాల నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్‌లోకి(AP)చొరబడే ప్రయత్నాలు పెరిగాయని, దీనిని ఎదుర్కొనేందుకు నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశామని తెలిపారు. నవంబర్ 17న ప్రారంభించిన ఆపరేషన్‌లో భాగంగా, 18వ తేదీ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగి హిడ్మా మద్వితో సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. అదేవిధంగా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మొత్తం 50 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, డివిజనల్ కమిటీ సభ్యులు, ప్లాటూన్ సభ్యులు, ఏరియా కమిటీ నాయకులు ఉన్నారు. ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. మంగళవారం జరిగిన మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh Chhattisgarh encounter Maoists Maredumilli police operation security forces

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.