విజయవాడ : ఎపిలో త్వరలో సంచలనాలు జరగబోతున్నాయని భారతీయ జనతా పార్టీ ఎపి విభాగం అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. గత ప్రభుత్వంలో అక్రమాలు, అరాచకాలు జరిగాయని, ఇప్పుడు వాటి అన్నింటిపై దర్యాప్తు సాగుతోందన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటూ మాధవ్ హెచ్చరికలు కూడాచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎపి బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ (PVN Madhav) సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ అవినీతి మాత్రమే కాదు.. గత ప్రభుత్వం అనేక అరాచకాలు చేసిందని విమర్శించారు.
Read also: AP: రాములవారికి 2కోట్లు విరాళంగా ఇచ్చిన వృద్ధ దంపతులు
Sensational events will happen soon
అక్రమార్కులకు తప్పకుండా శిక్ష పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వైసిపి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్ పై ఎపి చీఫ్ మాధవ్ పైవిధంగా స్పందించారు. మాధవ్ మాట్లాడుతూ.. మూడేళ్లకు ఒక్కసారి బిజెపి జాతీయ అధ్యక్షుడు మారుతూ ఉంటారని చెప్పారు. కార్యకర్తలను గుర్తించే పార్టీ బిజెపి అని.. ఈ పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం బిజెపి జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరగనుందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: