📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

AP: 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య

Author Icon By Anusha
Updated: December 25, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో స్క్రబ్ టైఫస్ కేసులు కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా పెదపులుగువారిపాలెంలో నాగబాబు అనే యువకుడు స్క్రబ్ టైఫస్‌తో మరణించడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 20కి చేరింది. (AP) గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. అయితే, తాజా మరణాలకు స్క్రబ్ టైఫస్‌తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా కారణమై ఉండవచ్చని వైద్యులు తెలిపారు.

Read Also: AP SSC: మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు.. హాజరు కానున్న 6.23లక్షల విద్యార్థులు

స్క్రబ్ టైఫస్ ఎలా వస్తుంది.. ఏం చేయాలి..

స్క్రబ్ టైఫస్ వ్యాధి నల్లిని పోలిన చిగ్గర్ మైట్ అనే కీటకం కాటు వలన వ్యాపిస్తుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కాదని వైద్యులు చెప్తున్నారు. పొలాలు, తోటలు, నదీ తీరాలు, పశువుల పాకలు, ఎలుకలు, పశువుల శరీరంపై ఈ కీటకాలు ఉంటాయని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొలాలు, తోటల్లో పనిచేసే కూలీలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

AP: Scrub typhus death toll reaches 20

గడ్డి, పొదలు వంటి ప్రాంతాలను శుభ్రపరుచుకోవాలని.. ఇంట్లో ఎలుకలు, కీటకాలు లేకుండా చూసుకోవాలంటున్నారు. శరీరం పూర్తిగా కప్పి ఉండేలా దుస్తులు వేసుకోవాలని.. ఆరుబయట నిద్రించడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లోని పాత మంచాలు, ఫర్నిచర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని.. పరుపులు, దుప్పట్లను శుభ్రపరుచుకోవాలని సూచిస్తున్నారు.

స్క్రబ్ టైఫస్ లక్షణాలు. .

తీవ్ర జ్వరం, నీరసం, తలనొప్పి, వణుకు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. అలాగే కీటకం కుట్టిన ప్రాంతంలో నల్లని మచ్చ ఏర్పడుతుంది. జీర్ణ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే సకాలంలో చికిత్స తీసుకుంటే కోలుకోవచ్చని చెప్తున్నారు. ప్రాథమిక దశలోనే డాక్టర్లు సూచించిన యాంటీబయాటిక్స్‌ వాడితే త్వరగా కోలుకోవచ్చని చెప్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP scrub typhus Bapatla district latest news Pedapuluguvaripalem scrub typhus deaths Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.