AP Schools: ఏపీలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ (AP Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడులు మార్చి 16 నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. 12:30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న సెంటర్లలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడుపుతారు. పరీక్షలున్నంత కాలం పదో తరగతి స్పెషల్‌క్లాసులు నడుస్తాయి. తెలంగాణలోనూ ఇదే తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.
Read Also: Superpowers : భారతదేశంవైపు అగ్రరాజ్యాల చూపు!
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: