విజయవాడ : ఏపీలో పాఠశాలలకు ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ప్రకటించారు. ఈ నెల 22 నుండి దసరా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరానన్నారు. ఈ క్రమంలో విద్యా అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. మంత్రి తెలిపినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో ఈనెల 22 సోమవారం నుంచి అక్టోబర్ 2గురువారం వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నెల 22 నుంచి దసరా సెలవులు
ఈ నిర్ణయాన్ని అధికారికంగా విద్యాశాఖ (Department of Education) తెలియజేసింది. ఉపాధ్యాయుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. “పాఠశాలలకు దసరా సెలవులు (Dussehra holidays) 22 నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరారు. టీడీపీ (TDP) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. వారి అభ్యర్థనను పరిశీలించి, విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం” అని లోకేశ్ వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: