ఏపీలో వైసీపీ పాలనలో ప్రారంభమైన గ్రామ–వార్డు సచివాలయ(AP Sachivalayam) విధానంలో కూటమీ ప్రభుత్వం కీలక మార్పులు చేపడుతోంది. ప్రజలకు పథకాలు, సేవలు మరింత సమర్థంగా చేరేందుకు ఈ వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఉద్యోగుల బదిలీలు, సచివాలయాల వర్గీకరణ వంటి అంశాలపై ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు సచివాలయాల పనితీరుపై ప్రజాభిప్రాయం తెలుసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
Read also: ప్రభుత్వ సేవలు పూర్తి డిజిటల్: సీఎం కీలక ఆదేశాలు
ఐవీఆర్‌ఎస్ కాల్స్‌తో సేవల పర్యవేక్షణ
గ్రామ–వార్డు సచివాలయాల్లో అందిస్తున్న సేవలపై ఐవీఆర్ కాల్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతున్నట్లు సమాచారం. పథకాల అమలు, ధృవపత్రాల జారీ, దరఖాస్తుల స్వీకరణ, సిబ్బంది అందుబాటు వంటి కీలక అంశాలపై ఈ ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. సేకరించిన అభిప్రాయాన్ని ఆధారంగా తీసుకుని సచివాలయ వ్యవస్థలో మరిన్ని మార్పులు చేసే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.
సచివాలయ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుదల
ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు ఎప్పటికప్పుడు విధుల్లో ఉండేలా ఉన్నతాధికారులు డీడీవోలు, ఎంపీడీవోలు, ఎంసీలు, ఎంజీవోలు, యూజీవోలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది హాజరు, ప్రజలతో వారి వ్యవహారం, మూమెంట్ రిజిస్టర్ నిర్వహణ వంటి అంశాలపై కఠినమైన సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యలపై సచివాలయ ఉద్యోగులు (Secretariat employees) అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తరచూ మార్పులు, హాజరు నిఘా, ఐవీఆర్ సర్వేలతో తమపై ఒత్తిడి పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర శాఖల ఉద్యోగులకు ఇలాంటి నిబంధనలు లేకపోయినా, తమపై మాత్రమే ప్రత్యేక నిఘా పెట్టడం అన్యాయమని వారు ఆరోపిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం మాత్రం ఆలస్యం కావడం పట్ల వారు అసంతృప్తిగా ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: