📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: AP: 13 జిల్లాలకు ఆర్టీజీఎస్ సెంటర్లు..

Author Icon By Sushmitha
Updated: November 1, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: మొంథా తుఫాను అనుభవం తర్వాత, ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌)(Real Time Governance) సాంకేతికతను మరింత బలోపేతం చేస్తోంది. విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి, ప్రాణనష్టాన్ని నివారించడానికి ఈ వ్యవస్థను కీలక కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా, రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్టీజీఎస్ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: Tanzania: టాంజానియా ఎన్నికల్లో హింస.. 700 మంది మృతి

AP

రాష్ట్రస్థాయి కేంద్రం, సేవలు

రాష్ట్ర ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సరికొత్త హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించారు. సచివాలయం సమీపంలో ఒక మల్టీపర్పస్ భవనాన్ని దీనికోసం నిర్మిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా ఆర్టీజీఎస్ సేవలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

జిల్లా కేంద్రాల నిర్మాణం, పర్యవేక్షణ

జిల్లాల్లో నిర్మించే ఆర్టీజీఎస్(RTGS centers) కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తారు. ఈ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్,(Command Control Center) సీసీటీవీ డేటా సెంటర్, ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ నెట్‌వర్క్ సెంటర్, కలెక్టర్, ఎస్పీలు సమీక్షించేందుకు సమావేశ మందిరం ఉంటాయి. రాష్ట్రస్థాయి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో 264 మంది కూర్చుని పనిచేయడానికి వీలుగా టేబుళ్లు, 338 మంది కూర్చునేలా ఒక పెద్ద హాలు, మినీ కాన్ఫరెన్స్ హాల్‌ను కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను ఎన్‌సీసీ-మ్యాట్రిక్స్ సంస్థ తీసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Government AP RTGS command control center Disaster Management e-governance. Google News in Telugu Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.