ఆంధ్రప్రదేశ్ (AP) లోని, విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పన్నవలస వద్ద సోమవారం ఒక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.. రాజాం నుంచి విజయనగరం వైపు వస్తున్న పల్లెవెలుగు బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం జరిగింది..
Read Also: Krishna District: రికార్డు స్థాయిలో మద్యం సేల్స్
ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో కలిపి మొత్తం 87 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్ అప్పల గురువులను, క్షతగాత్రులను చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: