ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రూ.713.33 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక మధ్య రవాణా అనుసంధానం మరింత బలపడనుంది.
Read Also: Disabled Posts : ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి
రవాణా అనుసంధానం మరింత పెరుగనుంది
ముఖ్యంగా (AP) అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రాంతానికి ఇది ఎంతో కీలకమైన ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు – చిక్‌బళ్లాపూర్ – చింతామణి మార్గం ఇప్పటికే ఉన్న నేపథ్యంలో, చిక్‌బళ్లాపూర్ నుంచి నేరుగా పుట్టపర్తికి రైల్వే లైన్ ఏర్పాటు కావడం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి రవాణా అనుసంధానం మరింత పెరుగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: