ఆంధ్రప్రదేశ్ (AP) లో, 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఇటీవల సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా చెప్పిన విషయం తెలిసిందే. అదే సమయంలో పెండింగ్ బకాయిలు రిలీజ్ చేసి 24వ తేదీలోపు అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. సీఎం హామీ మేరకు నిన్న ప్రభుత్వం రూ.50.04కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇవాళ పాస్టర్ల అకౌంట్లలో ఆ మొత్తం జమకానుంది.
Read Also: AP: రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి
కూటమి ప్రభుత్వం అందరి సంక్షేమానికి కట్టుబడి ఉంది
క్రైస్తవుల భద్రత, గౌరవానికి ఎలాంటి భంగం కలగనివ్వబోమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి మతాన్ని గౌరవిస్తామని.. కూటమి ప్రభుత్వం అందరి సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. పేదరికం లేని సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: