ఆంధ్రప్రదేశ్‌లో(AP) 2027 జూన్‌లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సన్నాహాలు ప్రారంభిస్తోంది. పుష్కరాల నిర్వహణను ఘనంగా చేపట్టాలనే లక్ష్యంతో ఏలూరు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో విస్తృత ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది.
Read also: Nara Lokesh: రాజమండ్రిలో పర్యటించిన విద్య, శాఖ మంత్రి
500కు పైగా ఘాట్లు, ₹3,000 కోట్ల వ్యయం అంచనా..
ఈ పుష్కరాల కోసం 500కు పైగా ఘాట్లను సిద్ధం చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు, భద్రత, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
పుష్కరాల నిర్వహణకు సుమారు ₹3,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో సమకూర్చుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం(AP) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో సుమారు 4.5 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తుండగా, 10 కోట్ల మందికి పైగా భక్తులు హాజరవుతారని భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: