📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

AP: ఆంధ్రప్రదేశ్ లో రైల్వేకు 10,134 కోట్ల నిధుల కేటాయింపు

Author Icon By Rajitha
Updated: February 3, 2026 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (తార్నాక), : ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం 2026- 27 సంవత్సరానికి గరిష్ట స్థాయిలో రూ. 10,134 కోట్ల నిధుల కేటాయింపు జరిగిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కోన్నారు. రైల్వేలకు కేటాయింపులతో కూడిన కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో సమర్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే, సమాచార ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, న్యూఢిల్లీ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపుల ముఖ్యాంశాలపై సోమవారం వర్చువల్ గా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Read also: Honey trap fraud : హనీట్రాప్ మోసం బట్టబయలు, యువకులను టార్గెట్ చేసిన మహిళ అరెస్ట్!

Rs. 10,134 crore allocated to railways in Andhra Pradesh.

అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ 2026- 2027 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో రూ. 10,134 కోట్ల బడ్జెట్ కేటాయింపులు మంజూరు అయ్యాయని తెలియజేశారు. 200914 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వార్షి క సగటు బడ్జెట్ వ్యయం రూ.886 కోట్లు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రానికి 2009- 14 మధ్యకాలంలో జరిగిన సగటు కేటాయింపులతో పోలిస్తే 11 రెట్లు పెరిగిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.92,649 కోట్ల కోట్ల విలువైన వివిధ మోలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలు చేయబడుతున్నాయని, ఆంధ్రప్రదేశ్లోని రైల్వే నెట్వర్క్ ఇప్పుడు 100శాతం విద్యుదీకరణ చెందిందని తెలియజేశారు. మంత్రి దేశవ్యాప్తంగా ఏడు హై స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. ఈ ఏడింటిలో, హైదరాబాద్ బెంగళూరు మరియు హైదరాబాద్ చెన్నై అనే రెండు హై స్పీడ్ రైలు కారిడార్లు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్తాయి.

ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో

దీనితో రాష్ట్ర ప్రజలకు అపారంగా ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ రెండు హై స్పీడ్ రైలు కారిడార్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కారిడార్లు ఆర్థిక వృద్ధి కారిడార్లుగా పనిచేస్తూ విద్య, ఆరోగ్యం, వ్యాపారం మొదలైన వాటికి సౌకర్యం కల్పిస్తాయి. ఈ హై స్పీడ్ రైళ్ల ప్రవేశంతో హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణ సమయం 2 గంటలు మరియు హైదరాబాద్- చెన్నై మధ్య ప్రయాణ సమయం 2 గంటల 55 నిమిషాలుగా ఉంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రాజెక్టులలో పెట్టుబడులపై నిరంతర దృష్టి సారించడం వలన రాబోయే సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల వృద్ధికి, మెరుగైన అనుసంధానాన్ని వైపు ముందుకు నడిపించే ఒక ముఖ్య మైన శక్తిగా రైల్వే బడ్జెట్ నిలుస్తుందని మంత్రి వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh High Speed Trains Indian Railways latest news Railway Budget 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.