📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest News: AP: CII భాగస్వామ్య సదస్సుకు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎంవో

Author Icon By Aanusha
Updated: November 13, 2025 • 9:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం, విశాఖపట్నంలో జరగబోయే సీఐఐ భాగస్వామ్య సదస్సుపై విశేష దృష్టి పెట్టింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పెట్టుబడుల ప్రవాహానికి ఇది మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సదస్సులో సుమారు రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని సీఎంఓ (Chief Minister’s Office) ప్రకటించింది. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అనేక ఒప్పందాలు (MoUs) కుదురుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Read Also: Lokesh Big Announcement : ఈరోజు 9 గంటలకు లోకేష్ కీలక ప్రకటన

AP

ఈ సదస్సును ప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తోంది

నవంబర్ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో 40 దేశాల నుంచి సుమారు 3,000 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సును ప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తోంది.

‘ఇన్వెస్ట్ ఇన్ ఏపీ’ (AP) సందేశాన్ని సమ్మిట్ ద్వారా చాటి చెప్పాలని సీఎం చంద్రబాబు సంకల్పించినట్లు పేర్కొంది. కాగా ఈ సదస్సులో సీఎం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు.

వీరితో పాటు విశాఖపట్నం జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ శంకర్ బ్రతా బాగ్చీ, ఇతర సీనియర్ అధికారులు పుష్పగుచ్ఛం అందించి ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh investment summit Chandrababu Naidu Invest in AP latest news Telugu News Visakhapatnam CII partnership summit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.